https://oktelugu.com/

Balakrishna: బాలయ్యను కలిసిన తెలుగు టాప్ డైరెక్టర్స్…

Balakrishna: బాలయ్య బాబు ఎమ్మెల్యేగా మరోసారి గణ విజయం సాధించడం అనేది గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ని నమోదు చేశారనే చెప్పాలి.

Written By:
  • Gopi
  • , Updated On : June 8, 2024 / 11:00 AM IST

    Telugu top directors met Balakrishna

    Follow us on

    Balakrishna: సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నటుడు బాలకృష్ణ.. ఇక బాలకృష్ణ వాళ్ళ ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీ తోనే కాకుండా పొలిటికల్ గా కూడా చాలా మంచి సంబంధాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నాన్న అయిన నందమూరి తారక రామారావు(NTR) గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎంగా కూడా పదవి బాధ్యతలను చేపట్టారు.

    ఇక ఆయన తదనంతరం ఆ పార్టీని బాలయ్య(Balayya) వాళ్ళ బావ అయిన నారా చంద్రబాబు నాయుడు గారు టేక్ ఆఫ్ చేసుకొని ఆయన ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఆ పార్టీని సక్సెస్ ఫుల్ గా ముందుకు కొనసాగిస్తూ తీసుకొస్తున్నారు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక అందులో భాగంగా బాలయ్య బాబు ఎమ్మెల్యేగా మరోసారి గణ విజయం సాధించడం అనేది గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఇప్పటికే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ ని నమోదు చేశారనే చెప్పాలి.

    Also Read: Ramoji Rao: యంగ్ టాలెంట్ ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందే… రామోజీ పరిచయం చేసిన స్టార్ హీరోలు వీరే!

    ఇక బాలయ్య బాబుకి కృతజ్ఞతలు తెలపడానికి చాలామంది సినీ సెలబ్రిటీలు బాలయ్య బాబుని కలవడానికి వస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఆయనతో సినిమాలు చేసిన గోపీచంద్ మలినేని(Gopichand Malineni), అనిల్ రావిపూడి(Anil Ravipudi) లాంటి స్టార్ డైరెక్టర్లు కూడా బాలయ్య బాబు తో కలిసి అతనికి విశేష్ ని తెలియజేశారు. ఇక బాలయ్య ఎమ్మెల్యేగా మరోసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే కాకుండా సినిమా షూటింగ్ ల్లో కూడా పాల్గొనడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన వరుస సినిమాలను లైన్ లో పెట్టి యంగ్ హీరోలకి సాధ్యం కానీ రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.

    Also Read: Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆయన వందల కోట్ల ఆస్తి ఎవరికి?

    ఇక ఇదిలా ఉంటే మరోసారి ఆంధ్రప్రదేశ్ లో ఎన్ డి ఏ కూటమితో కలిసి తెలుగుదేశం పార్టీ అధికారం లోకి వచ్చింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగించబోతున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు తమ పాలనతో జనానికి మంచి చేయాలని చూస్తున్నారు…