Lok Sabha Elections Results: ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంటులో అడుగు పెట్టి లక్షలాది మంది తరఫున తమ గళాన్నివినిపించే అవకాశం కొందరికే దక్కుతుంది. 17 లోక్‌సభలకు ఇప్పటికే వేల మంది వచ్చారు. అయితే అందులు కొద్ది మంది మాత్రమే మళ్లీ మళ్లీ వస్తున్నారు. అలాంటి సీనియర్ మోస్ట్ ఎంపీలు.. 18వ సభకు కూడా ఎన్నికయ్యారు. లక్షలాది ప్రజల మన్ననలు, అభిమానం చూరగొంటూ పదే పదే ఎంపీగా ఎన్నికవుతున్నారు. ఇంద్రజిత్ గుప్తా, వాజ్‌పేయి, కమల్‌నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేరకాగాంధీ, సంతోష్‌కుమార్ అగర్వాల్ వంటి నేతలు దశాబ్దాలపాటు చట్ట సభకు ప్రాతినిధ్యవ వహించారు. ఈ నేపథ్యంలో 18వ లోక్‌సభలోనూ అడుగుపెట్టనున్న సీనియర్ మోస్టు ఎంపీలు వీరే..
డాక్టర్ రవీంద్రకుమార్..
బీజేపీ సీనియర్‌నేత, కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్ లోక్‌సభలో అత్యంత సీనియర్ల జాబితాలో తొలి స్థానంలో ఉన్నారు. 1996 లో మొదటిసారి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. వరుసగా ఎనిమిదిసార్లు విజయం సాధించిన ఘటన ఆయన సొంతం. మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు.
సురేశ్ కొడికున్నిల్..
కేరళలో కాంగ్రెస్ దిగ్గజ నేతల్లో ఒకరు. మావెళిక్కర లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎల్‌ఎల్‌బీ చేసిన ఆయన విద్యార్థిశలోనే రాజకీయ ప్రవేశం చేశారు. 27 ఏళ్ల వయసులో 1989లో అదూర్ నుంచి పోటీ చేసి తొలిసారి పార్లమెంటులో అడుగు పెట్టారు. ఆ తర్వాత మవెళిక్కర నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు. తాజాగా 8వ సారి విజయం సాధించి 18వ లోక్‌సభలో అడుగుపెట్టబోతున్నారు.
ఏడుసార్లు..
పంకజ్ చైదరి(మహారాజ్‌గంజ్), బిగజినాగి రమేశ్ చందపప(బీజాపూర్), ఫాగన్ సింగ్(మల్దా), రాధా మోహన్‌సింగ్ (పుర్వి చంపారన్), మన్‌సుఖ్‌భాయ్ ధాంజీభాయ్(భరూచ్)తోపాటు డీఎంకే నేత టీఆర్.బాలు(శ్రీపెరంబదూర్) వరుసగా ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
– ఇక బీజేపీ నేతలు ఇంద్రజిత్‌సింగ్, శివరాజ్‌సింగ్ చౌహాన్, తృణమూల్ కాంగ్రెస్ నేత సుదీప్ బంధోపాధ్యాయ ఆరుసార్లు విజయం సాధించి లోక్‌సభకు వచ్చారు.
– హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఐదోసారి గెలిచారు. శిరోమణి అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్‌కౌర్, కాంగ్రెస్ సీనియన్ నేత శశిథరూరల్ నాలుగోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితోపాటు అనేక మంది మూడు, నాలుగు, ఐదు, ఆరుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.
– 17వ లోక్‌సభలో అత్యంత సీనియన్ నేతలుగా మేనకాగాంధీ, సంతోష్‌కుమార్ అగర్వాల్ ఉన్నారు. వీరు 8సార్లు ఎంపీలుగా గెలిచారు. తాజా లోక్‌సభ ఎన్నికలకు సంతోష్‌కమార్ దూరంగా ఉండగా, మేనకా గాంధీ ఓడిపోయారు.
– అంతకుముందు అనేక మంది దిగ్గజ నేతలు అనేకమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇంద్రజిత్ గుప్తా 11సార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు. ఆ రికార్డు ఇప్పటికీ అలాగే ఉంది. సీపీఐకు చెందిన ఆయన 1960 నుంచి 2001 వరకు(1977 మినహా) వివిధ లోక్‌సభ స్థానాల నుంచి 11 సార్లు ఎంపీగా గెలిచారు.
– భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 10సార్లు ఎంపీగా గెలిచారు. బలరాంపూర్, గ్వాలియర్, ఢిల్లీ నుంచి ఎంపీగా పనిచేసిన ఆయన తర్వాత ఐదుపర్యాయాలు (1991–2009) లఖ్‌నపూ నుంచి ప్రాతినిధ్యం వహించారు.
– యపీఏ–1 ప్రభుత్వసమయంలో లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసి సోమనాథ్‌చటర్జీ కూడా 10సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేత ఎంపీ సయీద్ కూడా పిసార్లు వరుసగా ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 1967 లో లక్ష్యద్వీప్ స్థానం ఏర్పాటైనప్పటి నుంచి ఆ స్థానానికి ప్రనాతినిధ్యం వహించారు.
– కాంగ్రెస్ దిగ్గజ నాయకుల్లో ఒకరు కమల్‌నాథ్. తన కుంచుకోటగా ఉన్న చింద్వాడా లోక్‌సభ స్థానం నుంచి 9సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. సమతా పార్టీ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండేజ్ 8సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.