Prabhas: ప్రభాస్ పెళ్లి చేసుకోకపోతే ఆయన వందల కోట్ల ఆస్తి ఎవరికి?

Prabhas: ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి అడిగితే ఏదోకటి చెప్పి దాటేశారు. ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. డార్లింగ్ ని నమ్ముకుంటే లాభం లేదని అభిమానులు ఏఐ టెక్నాలజీతో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసేశారు.

Written By: S Reddy, Updated On : June 8, 2024 10:17 am

If Prabhas is not married who owns his hundreds of crores of property

Follow us on

Prabhas: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయన పెళ్లి వార్త చెబితే వినాలని చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ వయస్సు 44 ఏళ్లు. ఆయన వివాహం పై కొన్నేళ్లుగా రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అనుష్క(Anushka) – ప్రభాస్ కి పెళ్లంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇప్పటికి కూడా అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.

కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి గురించి అడిగితే ఏదోకటి చెప్పి దాటేశారు. ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. డార్లింగ్ ని నమ్ముకుంటే లాభం లేదని అభిమానులు ఏఐ టెక్నాలజీతో ప్రభాస్, అనుష్క పెళ్లి చేసేశారు. వారి పిల్లలు ఎలా ఉంటారో కూడా తెరపైకి తెచ్చారు. ప్రభాస్, అనుష్క నాలుగు సినిమాల్లో కలిసి నటించారు. అందుకే ఎప్పుడైనా కలిసినప్పుడు క్లోజ్ గా కనిపిస్తారు. దీంతో ఫ్యాన్స్ వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని భావిస్తున్నారు.

Also Read: Vijay Deverakonda: విజయ్ దేవరకొండ లిప్ లాక్ సీన్లకు పుల్ స్టాప్ పెడుతున్న స్టార్ హీరోయిన్…

తామిద్దరం కేవలం స్నేహితులం అని ప్రభాస్, అనుష్క చెప్పుకొస్తున్నా అభిమానులు మాత్రం వారు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు. బాహుబలి 2(Bahubali 2) తర్వాత డార్లింగ్ – అనుష్క ఎక్కడా కలిసి కనిపించింది లేదు. సినిమాలు చేస్తూ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు. అనుష్కనే కాదు, ఎవరినీ ప్రభాస్ పెళ్లి చేసుకోరని…. ఆయనకు ఆ ఆలోచన లేదని తెలుస్తుంది. ఒక వేళ ప్రభాస్ సింగిల్ గా ఉండిపోతే ఆయన ఆస్తులు ఎవరికి చెందుతాయనే వాదన ఉంది.

Also Read: Prasanth Varma: హనుమాన్ 2 .. ఔత్సాహికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ

ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆయనకు ఖరీదైన బంగ్లాలు, ఫార్మ్ హౌస్లు, విదేశాల్లో ఇళ్ళు, లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రభాస్ కి వారసులు ఉంటే ఈ ఆస్తులు వారికి దక్కేవి. ప్రభాస్ పెళ్లి చేసుకొని పక్షంలో అవన్నీ మరొకరి సొంతం అవుతున్నాయి. ప్రభాస్ కి ప్రబోధ్, ప్రగతి అనే బ్రదర్ అండ్ సిస్టర్ ఉన్నారు. అలాగే పెదనాన్న కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు. ఒకవేళ ప్రభాస్ వివాహం చేసుకోకపోతే ఈ ఆస్తులు వీరికే దక్కుతాయని సమాచారం.