Telugu Star Heroes: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలోనే ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న మన హీరోలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మెప్పించే విధంగా సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు… ఇప్పటికే పాన్ ఇండియా ని శాసిస్తున్న హీరోల్లో మన హీరోలు మొదటి స్థానంలో ఉన్నారు.
బాలీవుడ్ హీరోలు మొన్నటిదాకా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలే హీరోలుగా నిలిచినప్పటికి గత పది సంవత్సరాలు నుంచి వాళ్ళు చేస్తున్న ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో మన స్టార్ హీరోలు నెంబర్ వన్ పొజిషన్ ను చేరుకునే దిశగా ముందుకు సాగుతూ ఉండడం విశేషం… మన స్టార్ హీరోలు ఎవరికి వారు మంచి సక్సెస్లను సాధించడానికి గొప్ప కాన్సెప్ట్లను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట కూడా మన హీరోలు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్న వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రేక్షకుడికి నచ్చే సినిమా చేయడం లేదని కొంతమంది కొన్ని విమర్శలు అయితే చేస్తున్నారు.
కానీ ఇప్పుడు రాబోతున్న సినిమాలతో మన స్టార్ హీరోలు మాత్రం ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. మరి ఇప్పటివరకు ఇండస్ట్రీ లో ఉన్న ఏ హీరోలకు సాధ్యం కానీ రీతిలో బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తున్న మన స్టార్ హీరోల మధ్యన విపరీతమైన పోటీ అయితే ఉంది.
మరి ప్రభాస్ ప్రస్తుతానికి నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుండగా, అల్లు అర్జున్ నెంబర్ 2 పొజిషన్ లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి నటులు కూడా పాన్ ఇండియాని శాసించే స్థాయికి ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఇప్పుడు వాళ్ళు చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎలాగైనా ఇకమీదట రాబోయే సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పలు రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నారు…మరి ఇప్పటికైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉంది అని బాలీవుడ్ వాళ్ళు ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది…