Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెప్పగానే ఇప్పుడు అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు రెబల్ స్టార్ ప్రభాస్… పాన్ ఇండియా మొత్తాన్ని ఒక్కడే షేక్ చేస్తూ వరుసగా భారీ విజయాలను సాధిస్తూ వస్తున్నాడు. ఇప్పటికే సలార్, కల్కి లాంటి భారీ సక్సెస్ లను అందుకున్న ప్రభాస్ ఇప్పుడు చేయబోతున్న ఫౌజీ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఆయన సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో చేయబోతున్న ‘స్పిరిట్ ‘ సినిమా కోసం కూడా ఇప్పటి నుంచే కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే సందీప్ వంగా సినిమాలో మేకవర్ లో చాలా చేంజ్ ఓవర్ అయితే చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన రొటీన్ రెగ్యులర్ గా ఉండే హీరోని కాకుండా తన సినిమాలో హీరోను కొంచెం కొత్తగా ప్రజెంట్ చేయాలని చూస్తుంటాడు. అందుకే ప్రభాస్ లోని కొత్త యాంగిల్ ను బయటకు తీయడానికి ఆయన చాలా రకాలుగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఒక సినిమా చేయడానికి చాలా క్యాలిక్యులేషన్స్ చేసుకొని మరి ముందుకు సాగుతూ ఉంటాడు. అలాంటి ప్రభాస్ చేత బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించే స్పిరిట్ సినిమాతో ఒక పెను మ్యాజిక్ ని చేయడానికి సందీప్ రెడ్డి వంగా రెడీ అవుతున్నాడు. మరి ఇక్కడి వరకు బాగానే ఉంది.
కానీ ఈ సినిమాలో ప్రభాస్ ని ఢీకొట్టే పాత్రలో ఒక స్టార్ హీరో నటించబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ అయితే ఉందట. దానికోసం వివిధ రకాల హీరోలను పరిశీలిస్తున్న సందీప్ కి ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక అందులో భాగంగానే యంగ్ హీరో అయిన కార్తికేయ ను ఈ సినిమాలో విలన్ గా తీసుకోవాలనే ప్రయత్నంలో సందీప్ గా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజానికి కార్తికేయ ఇంతకుముందు నాని హీరోగా వచ్చిన గ్యాంగ్ లీడర్ అలాగే తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన వలిమై సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు.
కాబట్టి ఆయన అయితే సినిమా కి చాలా బాగా సెట్ అవుతాడని సందీప్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక బాడీపరంగా చూసుకున్న కార్తికేయ చాలా ఫిట్ గా అండ్ సిక్స్ ప్యాక్ బాడీతో ఉంటాడు. కాబట్టి విలన్ పాత్రలో సరిగ్గా సరిపోతారని సందీప్ వంగ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కార్తికేయ కనక ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం ఆయన లైఫ్ మారిపోతుందనే చెప్పాలి…