https://oktelugu.com/

Fauji: హను రాఘవపూడి చేసిన సీతా రామం కి ప్రభాస్ తో చేసే ఫౌజీ కి మధ్య సంబంధం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ కాదు. కానీ అలాంటి సందర్భంలో కూడా మన హీరోలు మంచి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఇప్పటికే మన హీరోలు చేసే సినిమాలన్ని పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అవుతుండడంతో ఇండియా వైడ్ గా వాళ్ళకి మంచి స్టార్ డమ్ అయితే క్రియేట్ అవుతుంది...

Written By:
  • Gopi
  • , Updated On : October 8, 2024 / 10:02 AM IST

    Prabhas Fauji(1)

    Follow us on

    Fauji: లవ్ స్టోరీలను చాలా కొత్తగా తెరకెక్కించడం లో హను రాఘవపూడి కి చాలా ప్రత్యేకమైన పేరైతే ఉంది. ఆయన ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాలు లవ్ స్టోరీ లే కావడం విశేషం. ఇక తన చివరి సినిమా అయిన సీతా రామం సినిమాతో ప్రేక్షకులందరిని ఒక్కసారిగా కట్టిపడేయడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి హను రాఘవపూడి అంటే ప్రతి ఒక్కరికి మంచి నమ్మకమైతే ఉంది. ఒక ప్యూర్ లవ్ స్టోరీని ఎలాంటి బేషజాలు లేకుండా చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకుడిని మెప్పించడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఫౌజీ సినిమాలో కూడా ప్రభాస్ ఒక మిలిటరీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి సీతా రామం సినిమాలో హీరో కూడా ఒక సైనికుడిగా మనకు కనిపించాడు మరి ఇలాంటి సందర్భంలోనే సీతారామం సినిమాకి పౌజీ సినిమాకి మధ్య సంబంధం ఏంటి హను రాఘవపూడి కూడా తన యూనివర్స్ ను స్టార్ట్ చేశారా అంటూ మరి కొంతమంది కామెంట్లు అయితే చేస్తున్నారు.

    నిజానికి ఈ రెండు సినిమాల మధ్య ఎలాంటి సంబంధం అయితే లేదని హను రాఘవపూడి ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. రెండు స్టోరీలు ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్నాను అని చెప్పాడు. ఇక సీతారామం సినిమా ప్యూర్ లవ్ స్టోరీ గా మాత్రమే ఎలివేట్ అయింది. కానీ ప్రభాస్ సినిమాలో లవ్ స్టోరీ తో పాటు ఒక యుద్ధ వాతావరణంని తలపించే యాక్షన్ ఎపిసోడ్స్ కూడా భారీగా ఉండబోతున్నట్టుగా ఆయన తెలియజేశాడు.

    ఇక మొత్తానికైతే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేయడానికి హను రాఘవపూడి చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు. తన కోసమే ఈ కథ రాసుకున్నానని ఎలాగైనా సరే ఈ సినిమాను ప్రభాస్ తోనే చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాడు. కాబట్టి సీతారామం సినిమా సక్సెస్ అయిన తర్వాత వెంటనే ప్రభాస్ కి ఈ కథ వినిపించి సింగిల్ సెట్టింగ్ లో ఆయన చేత ఓకే చెప్పించినట్టుగా కూడా తెలుస్తోంది.

    ఇక మొత్తానికైతే ఇప్పుడు మరొకసారి ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించి పాన్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక ఆయన అనుకున్న ప్రయత్నం సక్సెస్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…