https://oktelugu.com/

Bigg Boss Telugu 8: పృథ్వీ గ్రూప్ గేమ్స్ ని ఏకిపారేసిన హరి తేజ.. దెబ్బ కు ఆ బ్యాచ్ మొత్తం బుక్ అయిపోయిందిగా!

నామినేట్ చేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ ' మీరు చాలా టాస్కులు ఆడేటప్పుడు చాలా బలంగా ఆడుతారు. కానీ మొన్న మెగా చీఫ్ టాస్క్ లో 'I', 'am' అనే రెండు పదాల మధ్య గ్యాప్ ఉంటుందా లేదా అనేది మీరు గమనించలేకపోయారు. అది మీకు చాలా ముఖ్యమైన టాస్క్, అది మీరు కచ్చితంగా గెలవాలి, కానీ ఆ క్షణంలో కూడా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారు తప్ప, మీకు మీరుగా ఆలోచించలేదు. ఇదొక్కటే కాదు, చాలా విషయాలలో ఇదే తీరుని మీలో గమనించాను.

Written By:
  • Vicky
  • , Updated On : October 8, 2024 / 09:36 AM IST

    Bigg Boss Telugu 8(92)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అద్భుతంగా ఆడే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరు పృథ్వీ రాజ్. ఫిజికల్ టాస్కులలో ఇతనితో పోటీ పడాలంటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఆ రేంజ్ లో గేమ్ ఆడుతాడు ఈయన. మనిషి కూడా చాలా మంచోడే, మనసులో ఎలాంటి కుళ్ళు పెట్టుకోడు, కానీ ఆయన చుట్టూ ఉండే స్నేహితుల ప్రభావం మాత్రం పృథ్వీ పై చాలా బలంగానే ఉంటుంది. నిర్ణయాలు చాలా తేలికగా మార్చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఆట తీరుని వివరిస్తూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ హరి తేజ నామినేషన్ వేస్తుంది.

    నామినేట్ చేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ ‘ మీరు చాలా టాస్కులు ఆడేటప్పుడు చాలా బలంగా ఆడుతారు. కానీ మొన్న మెగా చీఫ్ టాస్క్ లో ‘I’, ‘am’ అనే రెండు పదాల మధ్య గ్యాప్ ఉంటుందా లేదా అనేది మీరు గమనించలేకపోయారు. అది మీకు చాలా ముఖ్యమైన టాస్క్, అది మీరు కచ్చితంగా గెలవాలి, కానీ ఆ క్షణంలో కూడా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నిర్ణయాలు మాత్రమే తీసుకున్నారు తప్ప, మీకు మీరుగా ఆలోచించలేదు. ఇదొక్కటే కాదు, చాలా విషయాలలో ఇదే తీరుని మీలో గమనించాను. మీ చుట్టూ ఇద్దరు ముగ్గురు ఉన్నారు, మీకే తెలియకుండా మీ గేమ్ పై వాళ్ళు ప్రభావం పడేలా చేస్తున్నారు. వాళ్ళు చెప్తుంటే మీరు ఆడుతున్నట్టే ఉంది కానీ, మీ అసలు గేమ్ ప్లాన్ ఏమిటో మాకు అర్థం కాలేదు. రాబోయే రోజుల్లో మీ చుట్టూ ఉండేవాళ్ళు మీతో ఉండకపోవచ్చు, మీరొక్కరే నిలబడి ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది, అలాంటి సమయంలో కనీసం మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే ముందుకు వెళ్తారు’ అని అంటుంది.

    దీనికి పృథ్వీ సమాధానం ఇస్తూ ‘మీరు చెప్పిన దానిని నేను అంగీకరించలేను. ఇప్పటి వరకు క్లాన్స్ గా ఆడాల్సి వచ్చింది కాబట్టి మీకు అలా అనిపించొచ్చు, స్వతంత్రంగా కంటెస్టెంట్స్ కి ఇప్పటి వరకు బిగ్ బాస్ గేమ్స్ ఇవ్వలేదు’ అని అంటుంది. దీనికి హరితేజ సమాధానం ఇస్తూ ‘మీ నలుగురు గ్రూప్ గా ఏవైతే పనులు చేస్తున్నారో, ఆవే పనులు మాటికొస్తే రిపీట్ అవుతున్నట్టుగా మాకు అనిపించింది. ఆరోజు నిఖిల్ ఇచ్చిన తప్పుడు సలహా వల్లే మీరు సరిగా అక్షరాలను పెట్టలేకపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు అతని వద్దకు వెళ్లి ఎందుకు అలా తప్పు సలహా ఇచ్చావు అని అడగలేదు’ అని అంటుంది హరితేజ. అప్పుడు పృథ్వీ సమాధానం ఇస్తూ ‘నిఖిల్ ఇచ్చిన సలహాలు వల్లే నేను ఆరోజు అన్నీ రౌండ్స్ వేగంగా పూర్తి చేయగలిగాను, ఆ అక్షరాలలో చిన్న గ్యాప్ ఉంటుందని మేమిద్దరం గమనించలేదు’ అని చెప్పుకొస్తాడు. నేను మీ నామినేషన్ ని అంగీకరించను అని పృథ్వీ చెప్పగా, మీరు అంగీకరించినా, లేకపోయినా అది నా అభిప్రాయం, చెప్పాల్సింది చెప్పాను ఇక మీ ఇష్టం అని అంటుంది హరి తేజ. వాస్తవానికి పృథ్వీ వెర్షన్ లో కూడా అతను చెప్పినవి వాస్తవాలే, కానీ పప్పీ టాస్క్ లో యష్మీ, మణికంఠ ఉన్నప్పుడు పృథ్వీ నిమిషం కూడా ఆలోచించకుండా మణికంఠ ని తొలగిస్తాడు, సరైన కారణాలు కూడా చెప్పడు, కేవలం యష్మీ తన స్నేహితురాలు అనే కారణం వల్లే ఆమె ముందుకు పోనిచ్చాడు అనే అభిప్రాయం చూసే ప్రతీ ఒక్కరికి అనిపించింది. హరితేజ ఈ పాయింట్ ని కూడా తీసుంటే బాగుండేది.