https://oktelugu.com/

బాలయ్య ఏంటయ్యా ఇదీ.. భారీ ట్రోలింగ్

సినిమాల్లో పంచ్ డైలాగులు పేల్చినట్టే బయట కూడా బాలయ్య మాట్లాడేస్తుంటాడు. అదే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. ఏ టాపిక్ పై అయినా తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే బాలక్రిష్ణ కామెంట్స్ దుమారం రేపుతుంటాయి. తాజాగా బాలక్రిష్ణ ‘ఏఆర్ రెహమాన్’ ఎవరో తనకు తెలియదని చేసిన కామెంట్ జాతీయ స్థాయిలో వైరల్ అయ్యింది.ఒకవైపు రెహమాన్ ఫ్యాన్స్, మరో వైపు బాలయ్య అభిమానులు వారితో మాటల యుద్ధానికి దిగారు. ఇటీవల ఆదిత్య 369 సినిమా విడుదలై 30 ఏళ్లు […]

Written By: , Updated On : July 22, 2021 / 02:53 PM IST
Follow us on

Balayya Comments On AR Rahman

సినిమాల్లో పంచ్ డైలాగులు పేల్చినట్టే బయట కూడా బాలయ్య మాట్లాడేస్తుంటాడు. అదే ఇప్పుడు వివాదానికి కారణమవుతోంది. ఏ టాపిక్ పై అయినా తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే బాలక్రిష్ణ కామెంట్స్ దుమారం రేపుతుంటాయి.

తాజాగా బాలక్రిష్ణ ‘ఏఆర్ రెహమాన్’ ఎవరో తనకు తెలియదని చేసిన కామెంట్ జాతీయ స్థాయిలో వైరల్ అయ్యింది.ఒకవైపు రెహమాన్ ఫ్యాన్స్, మరో వైపు బాలయ్య అభిమానులు వారితో మాటల యుద్ధానికి దిగారు.

ఇటీవల ఆదిత్య 369 సినిమా విడుదలై 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాలక్రిష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆ సినిమాకు సంగీతం అందించిన ఇళయరాజా సంగీతం గురించి గొప్పగా మాట్లాడారు. ఇక రెహమాన్ లాంటి సంగీత దర్శకుడు ఎవరో కూడా తనకు తెలియదని.. పదేళ్లకోసారి హిట్స్ ఇచ్చే వారి గురించి పెద్దగా పట్టించుకోను అని కామెంట్ చేశాడు.

బాలయ్య వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. దీంతో ఏఆర్ రెహమాన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాలయ్యను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ‘అసలు బాలక్రిష్ణ ఎవరు?’ అంటూ who is balakrishna అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారు. కొన్ని గంటల్లోనే ఈ హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో ట్రెండ్ అయ్యింది.

ఆస్కార్ అవార్డును అందుకొని దేశానికి గర్వకారణం అయిన ఒక గొప్ప సంగీత దర్శకుడిపై ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని ట్రోల్స్ చేస్తున్నారు. బాలక్రిష్ణ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీుకోవాలని రెహమాన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఇక బాలయ్య ఫ్యాన్స్ కూడా దీనికి కౌంటర్ గా సోషల్ మీడియాలో రెహమాన్ ఫ్యాన్స్ కు కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ వివాదంపై బాలక్రిష్ణ ఏవిధంగా స్పందిస్తాడో చూడాలి.