
భారీ వర్షాల కారణంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉధృతి పెరుగుతున్నందున యుద్ధ ప్రాతిపదికన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రజాప్రతినిధులు, అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహించారు. బాల్కొండ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణమే పరిస్థితులను పర్యవేక్షించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డిని ఆయన ఆదేశించారు.