https://oktelugu.com/

ఏపీ కలికిరి సైనిక్‌ స్కూల్‌లో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో..?

టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఏపీ కలికిరి సైనిక్‌ స్కూల్‌ శుభవార్త చెప్పింది. 18 టీజీటీ, ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించి ఉద్యోగ ఖాళీలకు ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 7వ తేదీ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : July 22, 2021 / 02:46 PM IST
    Follow us on

    టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీల కోసం ఎదురు చూస్తున్న వాళ్లకు ఏపీ కలికిరి సైనిక్‌ స్కూల్‌ శుభవార్త చెప్పింది. 18 టీజీటీ, ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష నిర్వహించి ఉద్యోగ ఖాళీలకు ఎంపిక చేస్తారు. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

    ఆగస్టు 7వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంటుంది. https://sskal.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం 18 ఉద్యోగ ఖాళీలలో ఎంటీఎస్ ఉద్యోగాలు 14 ఉండగా లోవర్‌ డివిజన్‌ క్లర్క్‌ 2, మ్యాథ్స్ 1, టీజీటీ సోషల్‌ సైన్స్‌ ఒక ఉద్యోగ ఖాళీ ఉంది. ఎల్‌డీసీ, ఎంటీఎస్‌ ఉద్యోగ ఖాళీలకు పదో తరగతి పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

    టీజీటీ ఉద్యోగ ఖాళీలకు మాత్రం సీబీఎస్‌ఈ రూల్స్ ప్రకారం అర్హతలు ఉన్నవాళ్లు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 21 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా అర్హతకు తగిన వేతనం లభిస్తుంది.

    టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలు కావడంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉన్నప్పటికీ నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.