Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer Reality Show: తెలుగులో మరో సరికొత్త రియాలిటీ షో.. కంటెస్టెంట్స్ గా సుడిగాలి...

Sudigali Sudheer Reality Show: తెలుగులో మరో సరికొత్త రియాలిటీ షో.. కంటెస్టెంట్స్ గా సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్.. కాన్సెప్ట్ అరాచకం.

Sudigali Sudheer Reality Show: రాబోయే రోజుల్లో మన తెలుగు ఆడియన్స్ కి రియాలిటీ షోస్ ప్రధానమైన ఎంటర్టైన్మెంట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాలీవుడ్ లో ఇప్పటికే లెక్కలేనన్ని రియాలిటీ షోస్ వచ్చాయి. ఇప్పుడు తెలుగు లో ఆ కాన్సెప్ట్స్ ని కాపీ కొడుతూ మన సెలబ్రిటీలతో రియాలిటీ షోస్ ని ప్లాన్ చేస్తున్నారు. అలా ప్లాన్ చేసిన ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రతీ ఏడాది ఈ షో కోసం ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ షో తర్వాత రీసెంట్ గానే ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ అనే రియాలిటీ షో కూడా మొదలైంది. దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బిగ్ బాస్ లో నిర్వహించే గేమ్స్ కంటే , ఈ షోలో నిర్వహించే గేమ్స్ చాలా కష్టంగా ఉంటున్నాయి.

Also Read: ప్రియుడి కోసం ఏకంగా తల్లినే.. వామ్మో ఇటువంటి కూతురు పుట్టనే కూడదు

ఇదంతా పక్కన పెడితే త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ తెలుగు లో ‘ది ట్రైటర్స్’ అనే రియాలిటీ షో ని నిర్వహించనుంది. ఈ షోకి తేజ సజ్జ హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. బాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిల్చిన ఈ రియాలిటీ షో కాన్సెప్ట్ ఏంటంటే , పాతిక మంది కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి ఒక ఇంట్లోకి తీసుకెళ్తారు. హోస్ట్ సమక్షం లో అందరికీ కళ్ళకు గంతలు కడుతారు. హోస్ట్ ఒక ముగ్గురుని పట్టుకుంటాడు, వాళ్ళు ‘ట్రైటర్స్’ అన్నమాట. అంటే ద్రోహులు. వీళ్ళని అమాయకులు కనిపెట్టడమే షో టాస్క్. అయితే ట్రైటర్ ప్రతీ రోజు రాత్రి ఒక కంటెస్టెంట్ ని టవర్ వద్దకు తీసుకొచ్చి చంపేస్తూ ఉంటాడు. చంపడం అంటే నిజమైన చంపడం కాదు, ఈ కంటెస్టెంట్ చనిపోయాడు అని చీటీ మీద రాసి వదిలేస్తాడు. అంటే ఆ కంటెస్టెంట్ షో నుండి ఎలిమినతె అయిపోయినట్టే.

పక్క రోజు హోస్ట్ మళ్లీ వస్తాడు, మీలో ఎవరి మీద అనుమానం ఉంది, ట్రైటర్ ఎవరని అనుకుంటున్నారు అని అడుగుతారు. కంటెస్టెంట్స్ అందరూ ఎవరి పేరు ఎక్కువగా చెప్తే వాళ్ళు ఎలిమినేట్ అయ్యినట్టు. అది ట్రైటర్ అయినా కావొచ్చు, అమాయకులు అయినా కావొచ్చు. ఇలా షో మొత్తం సాగుతుంది. చివరికి ఈ షో టైటిల్ ని గెలిచేది ట్రైటరా?, లేదా అమాయకుడా ? అనేది చూడాలి. ఈ షో బిగ్ బాస్ లాగా వంద రోజులు ఏమి కొనసాగదు, కేవలం 10 రోజులు మాత్రమే సాగుతుంది. ఈ రియాలిటీ షో లో సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్, యాంకర్ శ్రీముఖి , బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య వంటి ప్రముఖులు కంటెస్టెంట్స్ గా పాల్గొనే అవకాశం ఉంది. అదే విధంగా బిగ్ బాస్ 9 నుండి తనూజ, కళ్యాణ్ , డిమోన్ పవన్ వంటి వారు కూడా ఈ రియాలిటీ షో లో పాల్గొంటారని టాక్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper