Homeఎంటర్టైన్మెంట్Telugu Movies Updates 15-09-2021: టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ కబుర్లు !

Telugu Movies Updates 15-09-2021: టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ కబుర్లు !

Telugu Movies Updates: నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ సినిమా సెన్సార్ పూర్తీ అయింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. కాగా ఈ సినిమాని ఈ నెల 24న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. యంగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి ఒక కథ చెప్పాడు. విష్ణువర్ధన్ గతంలో పవన్ కల్యాణ్ తో […]

Telugu Movies UpdatesTelugu Movies Updates: నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. అక్కినేని నాగచైతన్య – క్రేజీ బ్యూటీ సాయి పల్లవిల ‘లవ్ స్టోరీ’ సినిమా సెన్సార్ పూర్తీ అయింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. కాగా ఈ సినిమాని ఈ నెల 24న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.

యంగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ మెగా హీరో వైష్ణవ్ తేజ్ కి ఒక కథ చెప్పాడు. విష్ణువర్ధన్ గతంలో పవన్ కల్యాణ్ తో ‘పంజా’ సినిమాని రూపొందించిన సంగతి విదితమే.

మాజీ లవర్ బాయ్ అరవింద్ స్వామి ఓ మలయాళ సినిమాలో నటించబోతున్నాడు. తమిళ నటుడు ఆర్య ఈ సినిమాని నిర్మిస్తుండటం విశేషం. ఈ సినిమా టైటిల్ ‘ఓట్టు’. సుమారు ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అరవింద్ స్వామి మలయాళ సినిమా చేస్తున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ’(‘God Father’) సినిమాలో మంజు వారియర్ పోషించిన కీలక పాత్రను తెలుగులో మాజీ హీరోయిన్ సంగీత నటించబోతుంది. సంగీతను ఈ పాత్రకు ఎంచుకోవడానికి కారణం.. ఆ పాత్రలో కొంత నెగిటివ్ షేడ్స్ ఉంటాయి.

‘కమర్షియల్ క్లాసిక్ డైరెక్టర్’ కొరటాల శివ – ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న భారీ చిత్రానికి సంబంధించి రేపటి నుండి మ్యూజిక్ సిటింగ్స్ జరగబోతున్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper