Cinema Gossips: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’ షో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ షో సక్సెస్ వెనుక బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నందమూరి కష్టం కూడా ఉందని షో రైటర్ మచ్చ రవి తెలిపారు. షోలో బాలయ్యను కొత్తగా చూపేందుకు తేజస్విని చాలా రీసెర్చ్ చేశారని చెప్పారు. ‘అన్‌స్టాపబుల్’ టీమ్‌తో పనిచేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

అలాగే మరో క్రేజీ అప్ డేట్ విషయానికి వస్తే.. సీనియర్ హీరో సుమన్ తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు. భారత సైన్యం కోసం యాదాద్రి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్న తన 117 ఎకరాల భూమిని విరాళంగా అందజేశారు. అయితే, చెన్నై నుంచి తరచుగా హైదరాబాద్ ప్రయాణించే క్రమంలో కొన్ని పత్రాలు గల్లంతయ్యాయని, డబుల్ రిజిస్ట్రేషన్ కారణంగా ఆ భూములపై కోర్టులో కేసు కొనసాగుతోందని సుమన్ అప్పట్లో చెప్పారు. ఈ నేపథ్యంలో, తాజాగా భూములను సైన్యానికి అందజేసినట్టు తెలుస్తోంది.
Also Read: టాలీవుడ్ జనవరి రివ్యూ : తొలి నెలలోని సినిమాలన్నీ విలవిల !

మరో అప్ డేట్ విషయానికి వస్తే.. యంగ్ హీరోయిన్ సాక్షి అగర్వాల్ తన తండ్రి కలను నిజం చేసింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ కాలా మూవీలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక లగ్జరీ కారును కొనుగోలు చేసిన విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించింది. లగ్జరీ కారు కొనుగోలు చేయాలన్నది నా తండ్రి 45 ఏళ్ల కల అని తెలిపింది. ఈ కల సాకారం చేసుకునే విధంగా కొత్త మెర్సిడెజ్ బెంజ్ ఈ-క్లాస్ మోడల్ కారు కొనుగోలు చేశానని చెప్పింది.

Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !
[…] Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే, ఆయన మోకాలకు సంబంధించి చిన్న సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఆ తరువాత దర్శకుడు త్రివిక్రమ్ తో మహేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ క్రమంలోనే మార్చి 2వ వారం నుంచి సెట్స్ పైకి వెళ్లడానికి టీమ్ అంతా సిద్ధంగా ఉండాలని మహేశ్‌కి త్రివిక్రమ్ క్లారిటీ ఇచ్చారు. […]
[…] KCR: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు గతంలో తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు తెలిపారు. కానీ, ఇటీవల కాలంలో బీజేపీపై పోరు ప్రకటించారు. వరి ధాన్యం కొనుగోలు నుంచి ఈ పోరాటం షురూ కాగా, ఇకపై బీజేపీ ప్రభుత్వంపైన గట్టిగానే పోరాడబోతున్నారు. పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాలను కేసీఆర్ వారికి వివరించారు. కేంద్రంపై పోరాటంలో భాగంగా 23 పాయింట్ల ఎజెండాను కేసీఆర్ రూపొందించారు. […]
[…] PRC: ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ వివాదం ఇంకా ముదురుతోంది. ఈ వివాదంలో తమదే పై చేయి అనేలా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఉద్యోగులు సైతం పట్టు వీడటం లేదు. తము న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతుంటే, ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తూ వేతనాల్లో కోత పెడుతున్నదని అంటున్నారు. పీఆర్సీపైన విడుదల చేసిన జీవోను రద్దు చేస్తేనే చర్చలకొస్తామని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. చర్చలకు వస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. మొత్తంగా ఇరు వర్గాలు గట్టిగానే తమ వాదనను వినిపిస్తున్నాయి. […]