Bollywood Crazy Updates: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పాడిన పాట విడుదలైంది. కరోనా కారణంగా తన సినిమాలతో అభిమానులకు చేరువ కాలేకపోయాడు సల్మాన్ ఖాన్. ఈ క్రమంలో సొంతంగా ఓ పాట పడి ఇటీవలే విడుదల చేశాడు. ఇందులో తన గత స్మృతులన్నీ వీడియో రూపంలో పెట్టి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు.
కాగా తన అన్నదమ్ములతో కలిసి చేసిన డ్యాన్స్, ఫంక్షన్స్ లో ఇతరులతో కలిసి చేసిన డ్యాన్స్ మోమెంట్స్‌తో ‘డ్యాన్స్ విత్ మీ’ అనే ఈ పాటను రూపొందించాడు. ఇప్పుడిది యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. అసలు ఈ పాట ఈ స్థాయిలో ఉంటుందని ఊహించని అభిమానులు పాట విని, పాటలోని విజువల్స్ చూస్తూ బాగా సర్ ప్రైజ్ ఫీల్ అయ్యారు. మొత్తానికి సల్లూభాయ్ కొత్తగా ఆకట్టుకున్నాడు.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ డేట్స్ !
ఇక మరో మూవీ అప్ డేట్ విషయానికి వస్తే.. అల వైకుంఠపురములో చిత్రంపై నార్త్ సినీ అభిమానుల్లో ఫుల్ క్యూరియాసిటీ ఏర్పడింది. పుష్ప సక్సెస్‌తో ఈ చిత్రాన్ని కూడా థియేటర్లలో విడుదల చేయాలని నార్త్ అభిమానులు భావించారు. అయితే షెహజాదా నిర్మాతలు, అల్లు అరవింద్ కలిసి వద్దని వారించారు. దీంతో ఈ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా, డించక్ టీవీ చానెల్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే హిందీ ట్రైలర్ విడుదలై యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది.
ఇక ఇంకో అప్ డేట్ కి వస్తే.. బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఫిబ్రవరి 12న ఈ చిత్రం టీజర్ రానుంది.
Also Read: సండే ‘కరోనా’ గ్యాప్ ఇవ్వలా.. 950 మరణాలు.. కొత్తగా ఎన్ని కేసులంటే?