Rajinikanth Jailer 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనదైన రీతిలో సత్తా చాటుకున్న నటుడు రజినీకాంత్… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన ప్రేక్షకులను మెల్లించాలనే ఉద్దేశంతో తన బాడీ సపోర్ట్ చేయకపోయినా కూడా సోలో హీరోగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాలని చూస్తుండటం విశేషం… రజినీకాంత్ పేరు చెప్తే చాలు ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సంవత్సరం వచ్చిన ‘కూలీ’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాడు అనుకున్నప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో రజనీకాంత్ అభిమానులు చాలా వరకు డీలా పడిపోయారు. మొత్తానికైతే ఈ సినిమా సాధించలేని సక్సెస్ ని ‘జైలర్ 2’ సినిమాతో రజనీకాంత్ సాధించి చూపెడతాడు అనే కాన్ఫిడెంట్ తో ప్రేక్షకులైతే ఉన్నారు. ఇక వాళ్ళు పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక జైలర్ మొదటి పార్ట్ అంతా ఎఫెక్టివ్ గా లేకపోయిన కూడా కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ తో మాత్రమే ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లారు… అలాగే ఈ మూవీ విషయంలో ప్రేక్షకులు విస్మయానికి గురై ఈ సినిమాకి 300 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టారు.
Also Read: ఎన్టీఆర్ కెరియర్ ను మార్చేసిన ముగ్గురు డైరెక్టర్స్ వీళ్ళేనా..?
ఇక ఇలాంటి సందర్భంలో ఇప్పుడు వస్తున్నట్టుగా ఈ సినిమా విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఏమాత్రం తేడా కొట్టిన కూడా ఇప్పుడున్న జనాలు ఈ సినిమాను రిజెక్ట్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. కాబట్టి ఈ సినిమా విషయంలో ప్రతి ఒక్కరు చాలా కేర్ఫుల్ గా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది. ఈ సినిమాలో బాలయ్య బాబు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు అంటూ గతంలో కొన్ని వార్తలైతే వినిపించాయి.
కానీ బాలయ్య దానికి గ్రీన్ సిగ్నలైతే ఇవ్వలేదు. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక మేజర్ క్యారెక్టర్ లో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఆ విషయాన్ని ఇప్పటి వరకు బయటకి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు.
కారణం ఏంటి అంటే అది థియేటర్లో చూస్తేనే కిక్కు ఇస్తుందనే ఉద్దేశ్యంతో జూనియర్ ఎన్టీఆర్ నుంచి రెండు రోజులు డేట్స్ తీసుకొని ఆ క్యామియో రోల్ షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఎవరు ఏమనుకున్నా కూడా ఈ విషయాన్ని మాత్రం ఎక్కడా లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమాతో రజనీకాంత్ సూపర్ సక్సెస్ ని సాధిస్తే ఆ సక్సెస్ లో క్రెడిట్ జూనియర్ ఎన్టీఆర్ కు కూడా దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…