https://oktelugu.com/

Poonam Kaur : టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలను హీరోయిన్ గా తీసుకోరు…వాళ్ళకి ఆ హీరోయిన్స్ మాత్రమే కావాలి : పూనమ్ కౌర్

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిధి అయితే విపరీతంగా పెరిగిపోయింది.

Written By: , Updated On : February 10, 2025 / 11:08 AM IST
Poonam Kaur

Poonam Kaur

Follow us on

Poonam Kaur : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిధి అయితే విపరీతంగా పెరిగిపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఇండస్ట్రీ గా కొనసాగుతూ ఉండటం వల్ల మంచి సబ్జెక్ట్ తో సినిమాలు చేస్తే ఆ మూవీస్ ప్రేక్షకులకు రీచ్ అవ్వడమే కాకుండా భారీ గుర్తింపును కూడా సంపాదించుకునే అవకాశాలైతే ఉన్నాయి…

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది… ఒక సినిమా సక్సెస్ అయితే పది సినిమాలు ఆఫర్లు వస్తాయి. ఒక సినిమా ఫ్లాప్ అయితే మరొక సినిమా అవకాశం కూడా రాదు. మరి ఇలాంటి సందర్భంలో హీరోలు ఆచితూచి ముందుకు అడుగులు వేయాల్సిన అవసరమైతే ఉంది. ఇక హీరోల పరిస్థితి ఇలా ఉంటే హీరోయిన్ల పరిస్థితి మరి దారుణంగా తయారైంది. ఎందుకంటే వాళ్లు చేసే సినిమాల్లో వాళ్లకు ఐడెంటిటి ఉండదు. సినిమా సక్సెస్ అయిన కూడా వాళ్ళ పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే వాళ్లకు నెక్స్ట్ సినిమాలో అవకాశం అయితే ఉంటుంది. సాధారణంగా చాలా సినిమాల్లో హీరోయిన్స్ పాటలకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్లకి తర్వాత సినిమాల్లో అవకాశాలు రావాలన్నా కూడా అవి పాటలకు మాత్రమే పరిమితమయ్యే పాత్రలు దొరుకుతూ ఉంటాయి. తద్వారా అలాంటి సినిమాలు వాళ్ల కెరియర్ కి ఏమాత్రం హెల్ప్ అయ్యే అవకాశాలైతే లేవు. పొరపాటున సినిమా ఫ్లాప్ అయితే మాత్రం వాళ్లకు మరొక సినిమా ఉండదనే చెప్పాలి. ఐరన్ లెగ్ ముద్ర వేసి పక్కన పెట్టేస్తారు…

మరి ఇలాంటి సందర్భంలోనే పూనమ్ కౌర్ (Punam kour) మాట్లాడుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయరు అంటూ కొన్ని ఘాటు వ్యాఖ్యలైతే చేసింది. సావిత్రి (Savithri) గారి పేరు చెబుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఘనతను పెంచింది అంటూ ఆమె గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు.

కానీ తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా చేస్తామంటే మాత్రం వాళ్లని సినిమాల్లోకి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఇక ఏమైనా అంటే ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి హీరోయిన్స్ గా పెడుతూ ఉంటారు. కారణం ఏదైనా కూడా సినిమా ఇండస్ట్రీలో నటించాలి అనుకున్న ప్రతి వారికి ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. నాకు కూడా సినిమాల్లో చేయాలని ఉంది కానీ నన్ను సినిమాల్లో ఇప్పుడు ఎవరు తీసుకునే పరిస్థితి అయితే లేదు అంటూ ఆమె మాట్లాడటం తో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది…

మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయింది. ఇక అప్పుడప్పుడు త్రివిక్రమ్(Trivikram)మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది…మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఆఫర్స్ వస్తే నటించడానికి రెడీ గా ఉన్నానని చెబుతుండటం విశేషం…