Homeఎంటర్టైన్మెంట్నేను వాళ్ళకే సొంతం - 'పూజా హెగ్డే'

నేను వాళ్ళకే సొంతం – ‘పూజా హెగ్డే’

Pooja Hegdeఇప్పుడు టాలీవుడ్ హీరోలందరికి ‘పాన్ ఇండియా’ మోజు పట్టుకుంది. ప్రతి స్టార్ హీరో మెయిన్ టార్గెట్ పాన్ ఇండియానే. ఒక్క మహేష్ బాబు తప్ప మిగిలిన టాప్ హీరోలు ఇప్పటికే పాన్ తో తమ స్పాన్ పెంచుకుని పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోవాలని ప్రయత్నాలు మొదలెట్టారు. కాకపోతే ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ కి తప్ప దక్షిణాది హీరోలెవ్వరికి పాన్ ఇండియా ఇమేజ్ లేదు. దేశమంతా పాపులారిటీ లేదు.

ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. తెలుగు హీరోయిన్స్ లో నిజంగా పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ ఉన్న ఏకైక హీరోయిన్ ‘పూజా హెగ్డే’ మాత్రమే. పూజాకి ఇప్పటికే హిందీలో కూడా డిమాండ్ పెరిగింది. పైగా పూజా కెరీర్ కూడా హిందీలోనే స్టార్ట్ అయింది. మధ్యలో తెలుగులో స్టార్ హీరోయిన్ అయినా.. ఆమెకు మొదటి నుండి ప్రధాన టార్గెట్ బాలీవుడే.

ఈ విషయం అందరికి తెలుసు. అందుకే, పూజా తాను తెలుగోళ్ళకి సొంతం అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతుంది. తన తల్లితండ్రులు కన్నడిగులు అయినా, నేను పుట్టింది, పెరిగింది ముంబైలో అయినా.. నన్ను స్టార్ ను చేసింది మాత్రం తెలుగు సినీ పరిశ్రమే అని, తనకు మొదట స్టార్ డమ్ ను ఇచ్చింది తెలుగు ప్రేక్షకులే అని, అందుకే, తాను తెలుగు సినిమాకే రుణపడి ఉంటాను అని ‘పూజ హెగ్డే’ బాగానే లౌక్యం చూపిస్తోంది.

పైగా ఇంకా కబుర్లు చెబుతూ ‘నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడు నేను ఆలిండియా స్టార్ కావాలని కల కన్నాను. కానీ నాకు తెలుగులో ముందు పేరు వచ్చింది. ఇప్పుడు తమిళ, హిందీ సినిమాలు కూడా చేస్తున్నాను. మొత్తానికి నా కల నెరవేరుతోంది’ అంటూ తెగ ఫీల్ అవుతూ చెబుతుంది పూజా. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ‘రాధేశ్యామ్’, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ఆచార్య’ సినిమాల్లో నటిస్తోంది పూజా.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
Oktelugu Epaper
Exit mobile version