
సినిమా కష్టాలు మామూలుగా ఉండవంటారు. ఒక డైరెక్టర్ గా ఎదిగాడంటే అతడి వెనుకాల ఎన్ని సినిమా కష్టాలు ఉంటాయి. అంత కష్టపడితే కానీ ఇప్పుడు అందలం ఎక్కరు. తాజాగా ప్రభాస్ తో కలిసి ‘సాహో’ లాంటి ప్యాన్ ఇండియా మూవీని తీసిన దర్శకుడు సుజిత్ కన్నీటి కథ అందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉంది.
‘రన్ రాజా రన్’ అంటూ తొలి చిత్రంతోనే ఆకట్టుకున్న సుజిత్ నిజానికి ఆ సినిమా కథను ఒక్క రోజులో రాసేశాడట.. దానికి నేపథ్యం ఉంది. అది కదిలించేలా ఉందట..
దాదాపు సంవత్సరం పాటు కష్టపడి రూపొందించిన కథ ఓ నిర్మాణ సంస్థకు బాగా నచ్చిందట.. అయితే సెకండాఫ్ బాగా లేదని అనడంతో దాన్ని మార్చి వినిపించాడట దర్శకుడు సుజీత్. అయితే ఆ కథను ఓకే అన్న ప్రొడక్షన్ టీం ఆ తర్వాత ఫ్లేటు ఫిరాయించింది. ఈ కథకు బడ్జెట్ బాగా అవుతుందని అంత పెట్టలేమని తేల్చిచెప్పిందట..
కథ ఓకే అయ్యిందని జూబ్లిహిల్స్ నుంచి తను ఉంటున్న ముషీరాబాద్ కు వెళ్లిన సుజిత్ కు కాల్ వచ్చింది. ఆ కథ భారీ బడ్జెట్ అని.. చిన్న కథ ఉంటే చూడు అన్నారట.. దీంతో బోరున వర్షం బండిని పక్కన ఆపేసి మూడు గంటల పాటు అలాగే ఏడ్చాడట సుజిత్.
ఆ తర్వాత కమెడియన్ వెన్నెల కిషోర్ కు కాల్ చేసి చెప్పగా.. ‘షార్ట్ ఫిల్మ్ స్టోరీ గంటలో రెడీ చేస్తావ్.. సినిమా స్టోరీ ఒకరోజులో రాయలేవా? ఆలోచించు’ అని ప్రోత్సహించాడట.. అలా తేరుకున్న సుజిత్ బండిని స్ట్రాట్ చేయగా పెట్రోల్ అయిపోయింది.. స్ట్రాట్ కాలేదు. చేతిలో చిల్లి గవ్వ డబ్బులు లేవు. దీంతో జూబ్లీహిల్స్ నుంచి ముషీరాబాద్ వరకు తన బండిని తోసుకుంటూ వెళ్లాడట.. ఆ సమయంలో కోపం, బాధ, ఆవేదనలోంచి ‘రన్ రాజా రన్’ కథ పుట్టిందని.. దాన్ని ఒక్కరోజులో రాసేసి మూడో రోజు వినిపించి ఓకే చేసుకొని డైరెక్టర్ గా మారిపోయాడట సుజిత్.