Nano Tractor: అతి తక్కువ ఖర్చుతో రైతులకు ఎంతో ఉపయోగపడే నానో ట్రాక్టర్ ను తయారు చేసిన యువకుడు…దీని ధర ఎంతంటే..!

Nano Tractor: దాంతో రైతులు ట్రాక్టర్లు,వరికోత మెషీన్లు,వంటి వివిధ వ్యవసాయ పరికరాలను కిరాయికి తెచ్చుకొని పనులు పూర్తి చేస్తున్నారు.ఇలా చేయడం వలన రైతులకు తలకు మించిన భారం పడుతుందని చెప్పచ్చు.ఈ క్రమంలోనే ఒక యువకుడి వినూత్నమైన ఆవిష్కరణ అందరి ప్రశంసలు అందుకుంటుంది.ఆ యువకుడు రైతులకు ఎంతో ఉపయోగకరమైన నానో ట్రాక్టర్ ను రూపొందించాడు.ఇదివరకు చింతగిరి మల్లేశం అనే వ్యక్తి చేనేత వృత్తి కార్మికుల కోసం ఆసు యంత్రాన్ని కనుగొన్న సంగతి అందరికి తెలిగిందే.

Written By: NARESH, Updated On : July 7, 2024 9:51 pm

Nano Tractor

Follow us on

Nano Tractor: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రోజు రోజుకు వ్యవసాయ రంగంలో యంత్ర పరికరాల వినియోగం పెరుగుతుంది.వ్యవసాయంలో దుక్కి దున్నే దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంతవరకు వివిధ పరికరాల సహాయంతో పనులు కానిచ్చేస్తున్నారు.ఈ యంత్ర పరికరాల ధరలు లక్షల్లో ఉండటంతో రైతులు కొనలేని పరిస్థితి ఏర్పడింది.

దాంతో రైతులు ట్రాక్టర్లు,వరికోత మెషీన్లు,వంటి వివిధ వ్యవసాయ పరికరాలను కిరాయికి తెచ్చుకొని పనులు పూర్తి చేస్తున్నారు.ఇలా చేయడం వలన రైతులకు తలకు మించిన భారం పడుతుందని చెప్పచ్చు.ఈ క్రమంలోనే ఒక యువకుడి వినూత్నమైన ఆవిష్కరణ అందరి ప్రశంసలు అందుకుంటుంది.ఆ యువకుడు రైతులకు ఎంతో ఉపయోగకరమైన నానో ట్రాక్టర్ ను రూపొందించాడు.ఇదివరకు చింతగిరి మల్లేశం అనే వ్యక్తి చేనేత వృత్తి కార్మికుల కోసం ఆసు యంత్రాన్ని కనుగొన్న సంగతి అందరికి తెలిగిందే.

ఇప్పుడు ఇదే తరహాలో మెకానిక్ పనులు చేసుకునే వరంగల్ జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన యాడారం బ్రహ్మచారి  అనే యువకుడు తన నైపుణ్యం తో రైతులకు ఎంతో ఉపయోగపడే నానో ట్రాక్టర్ ను రూపొందించాడు.చిన్న,సన్నకారు రైతులకు ఈ ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.డ్రైవింగ్ అనుభవం లేని రైతులు కూడా దీన్ని ఉపయోగించే రూపొందించాడు ఆ యువకుడు.టన్ను బరువు వరకు లాగగలిగిన ఈ ట్రాక్టర్ అంతర పంటల సాగుకు బాగా ఉపయోగపడుతుంది.ఈ ట్రాక్టర్ కు డైనమో కూడా బిగించవచ్చు.

ఈ ట్రాక్టర్ ను తయారుచేయడానికి ఒక లక్షా నలభై వేల రూపాయలు ఖర్చు అయ్యిందని సమాచారం.గంటకు 10 నుంచి 15 కిలోమీటర్ల స్పీడు తో వెళ్లే ఈ ట్రాక్టర్ కు గంటకు ఒక లీటర్ డీజిల్ అవసరం అవుతుంది.అయిదు గేర్లు ఉన్న ఈ ట్రాక్టర్ ను చేతులతోనే ఆపరేట్ చేయవచ్చు.బ్రహ్మచారి మాట్లాడుతూ మొదట్లో ఒక గేరు ట్రాక్టర్ తయారుచేసానని దానికి 75 వేల రూపాయలు ఖర్చు వచ్చిందని చెప్పుకొచ్చాడు.