Celebrities vs Commoners in Bigg Boss 9: నిన్న బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది. ఈ షో లో సెలబ్రిటీలతో పాటు కొత్తగా కామనర్స్ కూడా వచ్చి చేరారు. ఇక వీళ్ళ మధ్య రసవత్తరమైన పోటీ అయితే ఉండబోతోంది అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లో అటు సెలబ్రిటీలు, ఇటు కామనర్స్ మధ్య విపరీతమైన పోటీ అయితే ఉంటుందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ రెండు బ్యాచ్ ల మధ్య సపరేట్ సపరేట్ గా పోటీ పెడతారా? లేదంటే అందరికి కలిపి టాస్క్ లను ఇస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశముగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా వీటివల్ల ఎవరికి ఎక్కువ హెల్ప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక సెలబ్రిటీలు కామినేర్స్ కామన్ గా పోటీ పడితే మాత్రం ఎవరు టాస్క్ లను బాగా ఆడితే వాళ్లు మాత్రమే గెలుస్తారు. మిగతా వాళ్ళు ఇంటికి వెళ్లి పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతోంది.
మొదటి వారంలో కామనర్స్ నుంచి ఎలిమినేట్ అవుతారా? లేదంటే సెలబ్రిటీల నుంచి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే దానిమీద క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి ఎవరు ముందుగా వెళ్ళినా కూడా వాళ్లు తమ టాస్కులను సరిగ్గా ఆడకపోవడం బిగ్ బాస్ హౌస్ లో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే తప్ప బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లి పోలేరు కాబట్టి ఈ వారం రోజులు ప్రతి ఒక్కరు వాళ్ళ టాస్క్ లను సక్రమంగా ఆడితే మాత్రం చాలామంది టఫ్ పోటీ ని ఇస్తారు.
లేకపోతే మాత్రం వీక్ గా ఉన్న కంటెస్టెంట్ ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించే అవకాశాలైతే ఉన్నాయి. మరి సెలబ్రిటీ నుంచి వెళ్తారా కామనర్స్ నుంచి వెళ్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అగ్నిపరీక్ష షో ద్వారా కామనర్స్ కి కూడా చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే వచ్చింది.
ప్రేక్షకుల్లో వాళ్ళకంటూ కొంతమంది ఫ్యాన్సును సంపాదించుకున్నారు. తద్వారా వాళ్ళు కూడా ఓటింగ్స్ వేసి వాళ్లను కాపాడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ కాంబినేషన్ ను మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అంటూ కొంతమంది మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…