Sirivennela: “సిరివెన్నెల” సిరిసంపదలను దాచుకుని వెన్నెల వంటి అద్భుతమైన ఆణిముత్యాల్లాంటి ఎన్నో పాటలకు జీవం పోశారు “సిరివెన్నెల సీతారామశాస్త్రి”. ఆయన మరణం పై తెలుగు చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు.ఆయన పాటలు వింటే ఎటువంటి బాధలో ఉన్న వ్యక్తి అయినా జీవితం పై ఏదో సాధించాలి అని అనిపించేలా ఎన్నో అద్భుతమైన పాటలు జీవం పోసారు.ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉన్న ఆయన పార్థివదేహానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు.
Also Read: సినీ విషాదాల మయం : 2020 – 21లో కన్నుమూసిన సినీ ప్రముఖులు వీళ్ళే !
సినిమా తారలే కాకుండా పలువురు రాజకీయ నేతలు కూడా ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి ఏపీ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని నివాళర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపి. ఆయన పాటలు చిన్నప్పటినుండి వింటూ పెరిగాను ఎంతో అద్భుతమైన సాహిత్యాన్ని తెలుగు చిత్ర పరిశ్రమకు అందించారని ఆయన లోటు తీరనిది అని చిత్ర పరిశ్రమ ఒక ఆణిముత్యాన్ని కోల్పోయిందని పేర్ని నాని అన్నారు.నాగార్జున చిరంజీవి బాలకృష్ణ ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించారు. ఆయన అంతిమ యాత్రలో పలువురు సీనీ,రాజకీయ ప్రముఖులు సహా అభిమానులు పాల్గొన్నారు.