https://oktelugu.com/

Sonu Sood: ఆ విషయంలో సోనూసూద్​కు అండగా ఉంటానంటున్న కేటీఆర్​!

Sonu Sood: కోవిడ్​ సమయంలో పేదలకు, వలసకార్మికులకు అండగా ఉండి.. వారి పాలిట దైవంగా మారారు బాలీవుడ్​ హీరో సోనూసూద్​. ఇప్పటికీ సాయం అన్న వారికి లేదనకుండా.. తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. హార్ట్​ సర్జరీ, ఆక్సిజన్​ ప్లాంటేషన్​, ఉద్యోగ కల్పన, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం ఇలా ఎన్నో పనులు చేస్తూ.. రియల్​ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఐటీ దాడులు జరిగాయి. కానీ, ఏ మాత్రం భయపడలేదు సోనూ. తాజాగా, ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 9, 2021 / 04:46 PM IST
    Follow us on

    Sonu Sood: కోవిడ్​ సమయంలో పేదలకు, వలసకార్మికులకు అండగా ఉండి.. వారి పాలిట దైవంగా మారారు బాలీవుడ్​ హీరో సోనూసూద్​. ఇప్పటికీ సాయం అన్న వారికి లేదనకుండా.. తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. హార్ట్​ సర్జరీ, ఆక్సిజన్​ ప్లాంటేషన్​, ఉద్యోగ కల్పన, పేద విద్యార్థులకు చదువు చెప్పించడం ఇలా ఎన్నో పనులు చేస్తూ.. రియల్​ హీరో అనిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ఐటీ దాడులు జరిగాయి. కానీ, ఏ మాత్రం భయపడలేదు సోనూ. తాజాగా, ఈ దాడులపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్​ స్పందించారు.

    తెలంగాణ ఇంపాక్ట్ గ్రూప్​ ఆధ్వర్యంలో కొవిడ్​ వారియర్స్​ సన్మాణ కార్యక్రమం జరిగింది. ఇందులో కేటీఆర్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే ప్రసంగణలో భాగంగా సెలబ్రిటీగా సోనూసూద్​ చేస్తున్న సేవలను ప్రశంసించారు. సోనూ రాజకీయాల్లోకి వస్తే తమకెక్కడ ఇబ్బండి వస్తుందేమోనని ఆయనపై ఐటీ, ఈడీ దాడులు చేయించడం అవమానకరమని అన్నారు. ఆయన ఇమేజ్​ను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారని.. సోనూసుద్​ భయపడనక్కర్లేదని తనకు మేం అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేటీఆర్​.

    సోషల్​ మీడియాలో కామెంట్స్ చేయడం ఎంతో సులువని అన్నారు. ప్రస్తుతం కేటీఆర్​ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్​గా మారాయి. మరోవైపు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్​ మాట్లాడుతూ.. కరోనా వల్ల చాలా మంది వారి ఆత్మీయులను కోల్పోయారన్నారు. కేటీఆర్​ లాంటి వారు ఉంటే సమాజానికి తనలాంటి అవసరం ఉండదని సోనూసూద్​ అన్నారు. కొవిడ్​ సమయంలో ఎందరికో అండగా ఉన్న సోనూసూద్​ పేరును.. ప్రజలు తమ పిల్లలకు, షాప్స్​కు పెట్టుకుంటున్నారంటే.. ఆయన చేసిన సాయం ఏ రేంజ్​లో ఉందో తెలుసుకోవచ్చు.