Kodali Nani: సీఎం జగన్ మేక కాదు.. పులి.. చంద్రబాబు, పవన్ పై కొడాలి’ తిట్ల వర్షం

Kodali Nani: ‘దాక్కో దాక్కో మేక.. పులి వచ్చి కొరుకుద్ది పీక’ అని ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పాడినట్టే పాడేశాడు ఏపీ మంత్రి కొడాలి నాని. ఎప్పుడూ కొత్తగా తిట్టే ఆయన ఈసారి చంద్రబాబు, పవన్ లను ఉద్దేశించి మేక పులి అంటూ కౌంటర్లు ఇచ్చారు. సీఎం జగన్ మేక కాదు.. పులివెందుల పులి అంటూ తిట్ల వర్ష కురిపించారు. ఏపీ రాజకీయాలు ఇప్పుడు కౌంటర్, ఎన్ కౌంటర్ లవైపు నిలుస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, […]

Written By: NARESH, Updated On : November 9, 2021 5:01 pm
Follow us on

Kodali Nani: ‘దాక్కో దాక్కో మేక.. పులి వచ్చి కొరుకుద్ది పీక’ అని ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ పాడినట్టే పాడేశాడు ఏపీ మంత్రి కొడాలి నాని. ఎప్పుడూ కొత్తగా తిట్టే ఆయన ఈసారి చంద్రబాబు, పవన్ లను ఉద్దేశించి మేక పులి అంటూ కౌంటర్లు ఇచ్చారు. సీఎం జగన్ మేక కాదు.. పులివెందుల పులి అంటూ తిట్ల వర్ష కురిపించారు.

Kodali Nani

ఏపీ రాజకీయాలు ఇప్పుడు కౌంటర్, ఎన్ కౌంటర్ లవైపు నిలుస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ విమర్శలకు అధికార పార్టీ తరుఫున ఏపీ ఫైర్ బ్రాండ్ మంత్రి కొడాలి నాని రంగంలోకి దిగారు. విపక్షాల తీరుపై మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ.. బుద్ది పెరగలేదన్నారు. ఎక్కడైనా సీఎం పెట్రోల్ రేట్లను తగ్గిస్తారా? అంటూ కౌంటర్ ఇచ్చారు.

పెట్రోల్ రేట్లపై వ్యాట్ తగ్గించాలని టీడీపీ ధర్నాలు చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ బుద్ది పెరగలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో పెట్రోల్, డీజిల్ పై రూ.2 సర్ చార్జి విధించినట్లు కొడాలి నాని విమర్శించారు. ఎక్కడైనా సీఎం పెట్రోల్ ధరలను తగ్గిస్తారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీకి ఎన్ని సార్లు ప్రజలు బుద్దిచెప్పినా చంద్రబాబుకు సిగ్గురావడం లేదన్నారు.

ఇక స్టీల్ ప్లాంట్ పై ఏపీ ప్రభుత్వానికి వారం రోజులు డెడ్ లైన్ పెట్టాడని.. వారం కాదు.. ఏడేళ్లు డెడ్ లైన్ పెట్టినా పవన్ ను జగన్ ఢిల్లీకి తీసుకెళ్లరని స్పష్టం చేశారు.కావాలంటే పవన్ కు చెందిన పార్టీలోని నేతలను పంపిస్తే తానే టిక్కెట్లు బుక్ చేయించి ఢిల్లీకి పంపిస్తానని.. దాని కోసం డెడ్ లైన్లు పెట్టాల్సిన అవసరం లేదని కౌంటర్ ఇచ్చారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ను ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కాదని.. తనతో పొత్తు పెట్టుకున్న మోడీని అంటూ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబుకు.. పవన్ కు ప్రధాని మోడీ, అమిత్ షాలు ఢిల్లీలో అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు కాబట్టే జగన్ ను తీసుకు వెళ్లాలని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ తీరును కొడాలి నాని చెడుగుడు ఆడేశాడు. ఇలా కొడాలి చండ్రనిప్పులకు ప్రతిపక్షాలు గల్లంతయ్యాయి.