Nagarjuna: అక్కినేని నాగార్జున నటించిన “సోగ్గాడే చిన్ని నాయన” సీక్వెల్ బంగార్రాజు సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది. షూటింగ్ ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడే సినిమా విడుదల తేదీ అంటూ హడావుడి కూడా మొదలు అయ్యింది. అయితే, బంగార్రాజు విడుదల పై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతోనే అప్పుడే మొదటి సాంగ్ ను రిలీజ్ చేసేందుకు బంగార్రాజు సిద్దం అయ్యాడు.

అయితే, ఇప్పటికే సంక్రాంతికి ఆర్ఆర్‌ఆర్ రేసులో మొదటి ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత భీమ్లా నాయక్, అలాగే రాధే శ్యామ్ లు కూడా రేసులో ఉన్నాయి. మరి ఈ భారీ సినిమాల మీద పోటీగా బంగార్రాజు ను సంక్రాంతికి విడుదల చేయాలనే నిర్ణయానికి రావడం అంటే సాహసమే. మరి ఆ సాహసాన్ని నాగ్ ఎందుకు ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తాడో చూడాలి.
పైగా బడ్జెట్ విషయంలో చాలా కంట్రోల్ లో ఉండే నాగార్జున ఈ సినిమా విషయంలో మాత్రం ఎలాంటి బడ్జెట్ పరిమితులు పెట్టుకోలేదట. మొత్తానికి ‘బంగార్రాజు’ను మొదటి నుంచి నాగ్ చాలా పర్సనల్ గా తీసుకున్నాడు. ఎలాగూ ‘సోగ్గాడే చిన్ని నాయన’ భారీ విజయం సాధించింది. కాబట్టి, ఆ సినిమా విజయం కారణంగా ఈ సినిమాకి కూడా మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉంది.
అందుకే, ఈ సినిమా బడ్జెట్ విషయంలో నాగార్జున ఎక్కడా వెనుకాడడం లేదు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘మనం’ తర్వాత నాగార్జున – నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే. పైగా ఈ సినిమాలో చైతుకి జోడీగా క్రేజీ హీరోయిన్ కృతి శెట్టి నటిస్తోంది.
Also Read: Viswak Sen: “ఓరి దేవుడా” అంటూ వచ్చేస్తున్న విశ్వక్ సేన్…
ఎంతైనా అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కీలకమైనది కాబట్టి, ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కల్యాణ్ కృష్ణ కురసాల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ హీరోయిన్ గా నటిస్తోంది.
Also Read: Tollywood: చర్చలకు దిగిన రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్… ఆ మూవీ కోసమేనా