Ticket Prices: ఈమధ్య కాలం లో తెలంగాణ లో విడుదలయ్యే సినిమాలకు టికెట్ రేట్స్ పెంపు పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వస్తోంది. ‘ఓజీ’ చిత్రం విడుదల సమయం లో ఒక వ్యక్తి టికెట్ రేట్స్ పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హై కోర్టు లో పిటీషన్ వేసాడు. సినిమా విడుదలైన మూడు రోజుల తర్వాత విచారణ చేపట్టిన ప్రభుత్వం, టికెట్ రేట్స్ జీవో ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత విడుదలైన ‘అఖండ 2’ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ సంక్రాంతికి విడుదల అవ్వబొయె ‘రాజా సాబ్'(The Rajasaab), ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) వంటి భారీ చిత్రాల నిర్మాతలు, టికెట్ రేట్స్ జీవో వచ్చే ముందే, హై కోర్టుని ఆశ్రయించారు. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కినవాని, దయచేసి వీటికి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇవ్వాలని కోరుతూ పిటీషన్లు వేశారు.
దీనిపై నేడు విచారణ చేపట్టిన హై కోర్టు, రెండు సినిమాల నిర్మాతలకు పాజిటివ్ గా రెస్పాన్స్ ఇచ్చింది. టికెట్ రేట్స్ పెంపు జీవో పై హోమ్ శాఖ నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. నిన్ననే ఈ జీవో బయటకు రావాల్సింది. కానీ హై కోర్టు నిర్ణయం తెలిపిన తర్వాత అధికారికంగా జీవో ని విడుదల చేస్తే బెటర్ అని అనుకున్నారు. నేడు సాయంత్రం జీవో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ జీవో వచ్చిన వెంటనే రెండు సినిమాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు కూడా ప్రీమియర్ షోస్ ఉండబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ‘రాజా సాబ్’ ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ దాదాపుగా 1000 రూపాయిల వరకు ఉంటుంది. అదే విధంగా తెలంగాణలో 900 రూపాయిల వరకు ఉంటుంది.
ఇక ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ 500 రూపాయిల వరకు ఉంటుందట. దీనికి సంబంధించిన జీవో కూడా నేడే రానుంది. ఇక ఈ రెండు సినిమాల ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ బాగా పిక్ అయ్యాయి. రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ‘రాజా సాబ్’ కి కచ్చితంగా USA నుండి 1 మిలియన్ డాలర్లు ప్రీమియర్ షోస్ నుండి వస్తాయని అంటున్నారు. అదే విధంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి కూడా ఆ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇది కూడా 1 మిలియన్ డాలర్ల గ్రాస్ ప్రీమియర్ షోస్ నుండి రాబడుతుందని అంటున్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తాయి అనేది.
Breaking – The Telangana High Court responded positively to the appeal by the makers of The Rajasaab and Mana Shankara Varaprasad Garu. The line is clear for both films to have ticket prices hike in Telangana. Expect the GO from the government to be issued anytime soon.
— Aakashavaani (@TheAakashavaani) January 7, 2026