Realme 16 Pro Series Pad 3: మొబైల్ కొనే సమయంలో కొందరు ధర విషయం ఆలోచిస్తే మరి కొందరు ఫీచర్స్, డిజైన్ గురించి సెర్చ్ చేస్తారు. అయితే కొన్ని కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లను అందించి తక్కువ ధరకే మొబైల్స్ అందిస్తుంటాయి. ప్రీమియం ఫోన్లు తలపించేలా అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తాయి. అలా Realme కంపెనీకి చెందిన ఓ మొబైల్ లో అడ్వాన్స్ టెక్నాలజీ ఫీచర్లు ఉండడంతోపాటు, కెమెరా, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండి తక్కువ ధరకే అందిస్తున్నారు. అంతేకాకుండా వీటిపై బ్యాంకు ఆఫర్లు కూడా ఏర్పాటు చేయడంతో అనుకున్న దానికంటే తక్కువకే మొబైల్ ను పొందవచ్చు. ఇంతకీ ఏ కంపెనీ కి చెందిన ఏ మొబైల్ తక్కువ ధరలో రానుంది? దాని వివరాలు ఎలా ఉన్నాయి?
Realme కంపెనీ లేటెస్ట్ గా 16 ప్రో తోపాటు ప్యాడ్ 3 ని విడుదల చేసింది. ఈ మొబైల్ చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 6.6 మిల్లీమీటర్ మందంతో స్లిమ్ గా ఉండి టెంప్ట్ చేస్తుంది. చుట్టూ మెటల్ బ్యాక్ ప్లేట్ తో కప్పేసి ఉంటుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్స్ సెన్సార్ పరికరం కూడా అమర్చారు. ఈ మొబైల్ డిస్ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 311.61 అంగుళాల 2.8k. 120 Hz డిస్ప్లేను కలిగి ఉంది. దీని స్క్రీన్ 550 నిట్ బ్రైట్నెస్ తో పనిచేస్తుంది. దీని పరువు 578 గ్రాములు. ఈ మొబైల్ లో బలమైన బ్యాటరీని చేర్చారు. ఇందులో 12,200 mAh బ్యాటరీని అమర్చారు. ఇది 45 వాట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 6.5 వాట్ వద్ద రివర్స్ చార్జింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ బ్యాటరీ తో ఒకే సారి 16.7 గంటల వరకు వీడియో నాన్ స్టాప్ గా చూసే అవకాశం ఉంటుంది. అలాగే డౌన్ టైం తక్కువగా ఉండడంతో ఒకసారి ఛార్జింగ్ చేస్తే రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు.
ఈ మొబైల్లో 8 జిబి రామ్ సపోర్ట్ చేయడంతో కావాల్సిన స్పీడు ఉండనుంది. అలాగే ఇందులో 256 జిబి స్టోరేజ్ ను అమర్చారు. దీంతో ఫోటోలు, వీడియోలు ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవాలని అనుకునే వారికి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఒకేసారి ఎన్నో రకాల యాప్స్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.
ఇక ఇందులో కెమెరా గురించి స్పెషల్ గా చెప్పుకోవచ్చు. ప్యాడ్ 3 మొబైల్ లో 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాను అమర్చారు. అలాగే ఫ్రంట్ లోను 8 మెగాపిక్సల్ తో పనిచేస్తుంది. ఈ రెండు కెమెరాలు కూడా లార్జెస్ట్ ఫోటోలను, వీడియోలను తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో నేటితరం వారికి అనుగుణంగా AI సాఫ్ట్వేర్ కూడా అమర్చారు. దీనిని భారత్లో రూ.26,999 ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు. టాప్ ఎండ్ వేరియంట్ రూ.31,999 వరకు ఉంది. అలాగే కొన్ని రకాల బ్యాంకు కార్డులు కూడా సపోర్ట్ చేస్తుండడంతో మరింత ధర తగ్గే అవకాశం ఉంటుంది.