Teja Sajja Mirai Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే తేజ సజ్జా లాంటి నటుడు వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలతో ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఇంతకుముందు హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన, ఇప్పుడు మిరాయి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ లో శ్రీరాముడు ఎంట్రీ అయితే ఉంటుంది.అది ఎవ్వరు ఊహించనట్టుగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. నిజానికి తేజ సజ్జా హిందూ దేవుళ్లను చాలా వాడుకుంటున్నాడు. మొన్న హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన ఆయన ఇప్పుడు శ్రీ రాముడిని వాడుకొని చాలా మంచి సక్సెస్ అయితే సాధించాడు. మరి ఏది ఏమైనా కూడా అతని కెరీర్ ని మార్చేసేయనే చెప్పాలి. ప్రస్తుతం మీడియం రేంజ్ హీరోల్లో నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నాడు.
మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలుస్తోందా? లాంగ్ రన్ లో ఎన్ని వందల కోట్లు రాబడుతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించిన తేజ సజ్జా నెక్స్ట్ సినిమాతో ఎలాంటి అంచనాలను అందుకుంటాడు.
తద్వారా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది… ఈ సినిమాని కార్తీక్ ఘట్టమనేని చాలా బాగా తెరకెక్కించాడు. ముఖ్యంగా సీజీ వర్క్ లో మాత్రం చాలా క్లారిటీని చూపించాడు. ఎక్కడ కూడా అది సిజి వర్క్ అని తెలియకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ మరి చేయించినట్టుగా తెలుస్తోంది.
ఇక కథ నుంచి ఎక్కడ డివియెట్ అవ్వకుండా చాలా ఎక్స్ట్రాడినరీ విజువల్స్ తో ప్రేక్షకుడికి కథను చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. మరి అందులో భాగంగానే ఇప్పుడు మిరాయి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించడానికి కార్తీక్ ఘట్టమనేని అహర్నిశలు కష్టపడినట్టుగా తెలుస్తోంది…