Free credit card offer: పండుగల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఇప్పటివరకు పూజలు, వ్రతాలు మాత్రమే కొనసాగాయి. ఇకనుంచి వస్తువుల కొనుగోళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగలు అయినా దసరా, దీపావళి, సంక్రాంతి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు కొత్త బట్టలు, కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ఇదే సమయంలో జీఎస్టీ కూడా తగ్గడంతో వస్తువుల కొనుగోల శాతం పెరిగే అవకాశం ఉంది. దీంతో కొన్ని కంపెనీలు, సంస్థలు ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయి. ఇదే అదనగా కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు కూడా జారీ చేస్తున్నాయి. అయితే కొన్ని బ్యాంకులు ఉచితంగా క్రెడిట్ కార్డులు ఇస్తామని ప్రకటిస్తున్నాయి. ఇవి ఎంతవరకు నిజం?
క్రెడిట్ కార్డులు ఉచితం అని ప్రకటించే బ్యాంకులను నమ్మకుండా ఉండడమే మంచిది. అయితే కొన్ని ప్రముఖ బ్యాంకులో సైతం ఉచితంగా క్రెడిట్ కార్డులు ఇస్తామని తెలుపుతున్నాయి. అయితే ఇప్పటివరకు క్రెడిట్ కార్డు లేని వారు.. ఒకటి రెండు క్రెడిట్ కార్డులు ఉన్నవారు.. లేదా ఇతర అవసరాలకు ఉపయోగించాలి అనుకుంటే వీటిని తీసుకోవచ్చు. అలాగే ఇప్పటికే చాలా వరకు క్రెడిట్ కార్డులు ఉంటే మరో క్రెడిట్ కార్డుగా దీనిని అస్సలు ఎంచుకోవద్దు.
ఏ క్రెడిట్ కార్డును.. ఏ బ్యాంకు ఉచితంగా ఇవ్వదు. ఫస్ట్ జారీ చేసినప్పుడు సాధారణంగా కొంత రుసుముంటుంది. అయితే ఈ రుసుం మినహా ఇస్తారు.. కానీ ఆ తర్వాత యధావిధిగా అన్ని చార్జీలు వేస్తూ ఉంటారు. ఉదాహరణకు కార్డు దొంగిలించినా.. లేదా పాత కార్డు స్థానంలో కొత్త కార్డు తీసుకున్నా.. ప్రాసెస్ చార్జీలు వేస్తుంటారు. ఇవి ఎంత అనేది ఆయా కార్డును బట్టి ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ ఫీజు వంటివి కూడా ఉంటాయి. అయితే ఎవరు ఈ విషయాన్ని ముందుగా చెప్పరు. కార్డు తీసుకున్న తర్వాత బిల్లులో దీనిని జమ చేస్తారు. అందువల్ల క్రెడిట్ కార్డును తీసుకునే ముందు వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి.
ఒకవేళ ఇలాంటి క్రెడిట్ కార్డు తీసుకున్నా.. ఆ తర్వాత మిగతా కార్డు లాగే చార్జీలు ఉంటాయి. అయితే క్రెడిట్ కార్డును వాడేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. అదనంగా దీనిని తీసుకున్నట్లయితే కేవలం అత్యవసరానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. దీనిని వాడిన తర్వాత బిల్లును మొత్తం చెల్లించాలి. కొందరు కనీస బిల్లును చెల్లించాలని అనుకుంటారు. కానీ మిగతా మొత్తం పై వడ్డీని వేస్తారు. అందువల్ల సాధ్యమైనంత వరకు పూర్తి బిల్లును చెల్లించే ప్రయత్నం చేయాలి. క్రెడిట్ కార్డు బిల్ జనరేట్.. బిల్ పేగు 50 రోజుల వ్యవధి ఉంటుంది. అయితే అత్యవసరం అయితేనే మధ్యలో వాడాలి.. కొన్ని నెలవారీ వస్తువులను బిల్ జనరేట్ అయినా మనుసటి లేదా ఆ తర్వాత రెండు రోజుల్లో కొనుగోలు చేస్తే ఎక్కువకాలం కలిసి వస్తుంది.
క్రెడిట్ కార్డులను దాదాపు ఇతరులకు ఇవ్వకుండా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వారు సరైన విధంగా బిల్లులు చెల్లించకపోతే ఆ భారం కార్డు సొంతం అయిన వారిపై పడుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ కూడా తెగిపోతుంది. అందువల్ల దగ్గరి బంధువులకు క్రెడిట్ కార్డు ను అస్సలు ఇవ్వకండి.