Money management lessons: జీవితాన్ని నడిపించేది డబ్బు.. ఇది అందరి వద్ద ఒకేలా ఉండదు. కొందరి వద్ద ఎక్కువగా.. మరికొందరి వద్ద తక్కువగా ఉంటుంది. అయితే ప్రతి ఒకరికి ఒక అవకాశం వస్తుంది. ఈ అవకాశం డబ్బు సంపాదించుకోవడానికి ఉంటుంది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకొని భారీగా డబ్బు సంపాదిస్తారు. కానీ కొందరు మాత్రమే వీటిని కాపాడుకుంటూ ఉంటారు. చేతిలోకి డబ్బు వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే ఆ తర్వాత మళ్లీ యథా స్థానానికి వెళ్లే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు డబ్బును ఏం చేయాలి? అవసరాలను తీర్చుకోవద్దా? అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ ఫుట్ బాల్ ప్లేయర్ స్టోరీ వింటే సందేహం తీరుతుంది..
ఆఫ్రికన్ దేశానికి చెందిన Sadio mane సంపాదన మన దేశ కరెన్సీ ప్రకారం వారానికి రూ.140 మిలియన్లు. అయితే ఆయన చేతిలో ఎప్పుడూ పగిలిపోయిన ఫోన్ కనిపిస్తూ ఉంటుంది. అదేంటి ఇంత డబ్బు ఉన్న అతడు.. ఫోన్ ను కనుక్కోలేడా? అని సందేహం రావచ్చు. వాస్తవానికి ఆయన దగ్గర ఫోన్ స్టోర్ ని కొనుగోలు చేసే శక్తి ఉంది. కానీ పగిలిపోయిన ఫోన్ తోనే కనిపిస్తాడు. ఇది చూసిన వాళ్లలో ఒకరు అతన్ని అడిగారు. ఇలా ఎందుకు అని.. దీంతో ఆయన.. డబ్బు అనేది చాలా విలువైనది. దీనిని అవసరం అయినంతవరకు మాత్రమే ఖర్చు పెట్టాలి. నేను ఎంతో కటిక పేదరికం చూశాను. డబ్బు లేకపోతే జీవితమే బాగుండదు. అందుకే డబ్బులు కాపాడుకుంటూ ఉండాలి. నాకు వచ్చే డబ్బుతో పాఠశాలను కట్టిస్తాను.. వైద్యశాలల్లో నిర్మిస్తాను.. కానీ మొబైల్స్ మాత్రం కొనుగోలు చేయను. ఎందుకంటే వాటికంటే మొబైల్ గొప్పది ఏం కాదు.. అని సమాధానం ఇచ్చాడు.
ప్రతి వ్యక్తి కూడా అవసరం ఉన్నంతవరకు మాత్రమే డబ్బులు ఖర్చు పెడితే.. భవిష్యత్తులో ఎంతో డబ్బు మిగిలే అవకాశం ఉంది. అలా కాకుండా అనవసరమైన వాటికోసం ఖర్చు పెడితే.. ఒక్కోసారి అవసరమైన వస్తువులు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల వస్తువుల కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కొందరు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఏ వస్తువు అవసరమో? ఏది అనవసరమో? గుర్తించి వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని.. అలా కాకుండా అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఎంతో డబ్బు వృధా చేయాల్సి వస్తుందని అంటున్నారు.
మరి కోరికలను తీర్చుకోవద్దా? అంటే ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో ఇంట్లో అవసరాలు.. పొదుపు.. ఇతర ఖర్చులు మినహాయించిన తర్వాత మిగిలిన దానితో మాత్రమే కోరికలను తీర్చుకోవాలి. కోరికల కోసం అప్పులు చేయవద్దు.. అలా కోరికల కోసం అప్పులు చేస్తే ఆ తర్వాత మరిన్ని కోరికలు పెరుగుతాయి తప్ప.. డబ్బు మిగలదు.. అంతేకాకుండా అత్యవసరాలకు చేతిలో డబ్బు ఉండదు. అందువల్ల డబ్బులు అనవసరపు వస్తువులు కొనుగోలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు.