https://oktelugu.com/

Shobha Shetty: గుండెలపై శోభ శెట్టి పేరు టాటూ వేయించుకున్న ఆ కంటెస్టెంట్… ప్రియుడు ఉండగా ఇవేం పనులు!

హౌస్ లో ఉన్నప్పుడు శోభా శెట్టి తో బాగా క్లోజ్ గా ఉండేవాడు. శోభా కూడా తేజ తో ఎక్కువ టైం స్పెండ్ చేసేది. తేజ తో అన్ని విషయాలు షేర్ చేసుకునేది.

Written By:
  • NARESH
  • , Updated On : January 16, 2024 / 11:46 AM IST

    Shobha Shetty

    Follow us on

    Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ టేస్టీ తేజ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు. ఫుడ్ వ్లాగ్స్ తో పాటు, సీజన్ 7 కంటెస్టెంట్స్ అందరితో కలిసి గెట్ టు గెదర్ అంటూ వీడియోలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. తాజాగా తన గుండెల పై కంటెస్టెంట్ శోభ శెట్టి పేరు టాటూ వేయించుకుని అందరిని షాక్ కి గురిచేస్తున్నాడు. తేజ హౌస్ లో ఉన్నప్పుడు ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకున్నాడు. అందరితో కలిసిపోయి గేమ్ ఆడుతూ పాజిటివిటీ తో బయటకు వచ్చాడు.

    అయితే హౌస్ లో ఉన్నప్పుడు శోభా శెట్టి తో బాగా క్లోజ్ గా ఉండేవాడు. శోభా కూడా తేజ తో ఎక్కువ టైం స్పెండ్ చేసేది. తేజ తో అన్ని విషయాలు షేర్ చేసుకునేది. అయితే బిగ్ బాస్ వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ వెయ్యాలి అని గట్టి ప్రయత్నాలు చేశారు. శోభా – తేజ క్లోజ్ గా ఉండటంతో శోభా పేరు టాటూ వేయించుకోవాలి అంటూ బిగ్ బాస్ ఇరికించే ప్రయత్నం చేశాడు. కానీ తేజ మాత్రం దానికి ఒప్పుకోలేదు. అలా మంచి ఫ్రెండ్స్ గా వాళ్ళు హౌస్ లో కొనసాగారు.

    తేజ తొమ్మిదో వారంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. ఇక శోభా 14 వారాలు హౌస్ లో ఉంది. శోభా బయటకు వచ్చిన తర్వాత తేజ – శోభా శెట్టి కలుస్తూ ఉంటున్నారు. మిగిలిన వాళ్లతో కంటే కూడా శోభా ఎక్కువగా తేజ తో కలిసి కనిపిస్తుంది. ఈ క్రమంలో టేస్టీ తేజ శోభా శెట్టి ని కలిశాడు. ఇద్దరు కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. శోభా కి ఓ షాక్ ఇచ్చాడు. తన గుండెల పై వేసుకున్న టాటూ ని చూపించాడు. దీంతో శోభా షాక్ అయింది.

    ఇదేంట్రా ఇది నిజమైన టాటూయేనా అంటూ చూడగా .. అది ఫేక్ అని తెలిసిపోయింది. అందులోనూ శోభా పేరును తప్పుగా రాశారు. అదేదో స్టిక్కర్, లేదా పెన్నుతో రాసినట్లు కనిపిస్తుంది. శోభా లో హెచ్ లేదని శోభా అంది. దీంతో పొనీలేవే నీ కోసం టాటూ వేయించుకున్న అది చాల్లే నీకు, అంటూ తేజ చెప్పుకొచ్చాడు. తర్వాత రుచికరమైన వంటలు తింటూ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో ని తేజ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాడు. కాగా యశ్వంత్ రెడ్డిని శోభా శెట్టి ప్రేమిస్తుంది. వీరు త్వరలో వివాహం చేసుకోనున్నారు.