Sukumar: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక సపరేట్ ఇమేజ్ నైతే ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా సుకుమార్ లాంటి దర్శకుడు అయితే తన లాజిక్కులతో మ్యాజిక్కు చేసి ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇస్తూ మంచి సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాల్లో ప్రతి దానికి ఒక లాజిక్ అనేది రాసుకుంటూ ఉంటాడు.ఆయన ఇండస్ట్రీ కి రాకముందు లెక్కలు మాస్టర్ గా పని చేయడం వల్లనే ఆయన ఆయన సినిమాల్లో లాజిక్కులకు చాలా ప్రాధాన్యతనిస్తూ సినిమాలు చేస్తాడు.
ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ఇక ఇలాంటి క్రమంలో సుకుమార్ ఒక విషయంలో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే పుష్ప 2 సినిమాలో కొన్ని సీన్లు లాజికల్ గా సుకుమార్ కి అంత సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదంట. ఇక దాంతో స్క్రిప్ట్ ని ఒకసారి రీ చెక్ చేసుకునే పనిలో పడ్డట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ఒకవేళ దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు జరిగినట్టయితే ప్యాచ్ వర్క్ లాంటివి చేయాలనే ఉద్దేశ్యం లో సుకుమార్ ఉన్నాడు. ఇక సినిమా హిట్టా, ఫ్లాపా అనే విషయం పక్కన పెడితే లాజిక్కుల్లో మాత్రం సుకుమార్ ఎప్పుడు మిస్ అవ్వకుండా ప్రతిదానికి క్లారిటీ ఇస్తూ వస్తుంటాడు.
ఇక పుష్ప 2 లో అలాంటి చిన్న మిస్టేక్ జరుగుతుందనే ఉద్దేశ్యం తోనే మళ్లీ క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక దీంతో సుకుమార్ మరొకసారి వార్తల్లో నిలిచాడు ఇక ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామంటూ సంక్రాంతి కానుకగా సినిమా యూనిట్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది.
అందులో భాగంగానే ఆ సినిమాకు సంబంధించిన పనులన్నీ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయి చాలా వరకు పూర్తయింది. మరి ఈ సినిమాతో సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…