Sai Pallavi Sister: అక్క సాయి పల్లవికి పెళ్లి కాకుండానే చెల్లి పూజా ఖన్నా ఏడడుగులు వేయనుంది. ప్రియుడిని పరిచయం చేసి అక్కకు షాక్ ఇచ్చింది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి పూజా కన్నన్ చెల్లెలు. ఈమె కూడా నటిగా ప్రయత్నం చేశారు. 2021లో విడుదలైన చిత్తిరాయ్ సెవ్వానం మూవీలో ఆమె నటించారు. సముద్ర ఖని మరో ప్రధాన పాత్ర చేశాడు. ఈ మూవీలో పూజా కన్నన్ నటనకు ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా ఆడలేదు.
ఈ మూవీ అనంతరం పూజా కన్నన్ మరలా చిత్రాలు చేయలేదు. సడన్ గా ప్రియుడిని పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వినీత్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు, త్వరలో పెళ్లి అంటూ కామెంట్ చేసింది. వినీత్ నా క్రైమ్ పార్ట్నర్, ఇప్పుడు లైఫ్ పార్ట్నర్. నా ఆశా కిరణం అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. త్వరలో వినీత్ ని పూజా కన్నన్ చేసుకోనుందని క్లారిటీ వచ్చింది.
అయితే అక్క సాయి పల్లవికి ఇంకా పెళ్లి కాలేదు . అక్క పెళ్లి చేసుకోకుండానే చెల్లి పూజా కన్నన్ పెళ్ళికి సిద్దమైందన్న మాట. ఇది హిందూ సాంప్రదాయానికి విరుద్ధం. అయితే ఈ రోజుల్లో చాలా కామన్. అందులోనూ హీరోయిన్స్ విషయంలో ఎలాంటివి జరుగుతూనే ఉంటాయి. సాయి పల్లవి హీరోయిన్ గా ఫార్మ్ లో ఉంది. ఆమె వరుస చిత్రాలు చేస్తుంది. అందుకే ఆమె ఇప్పట్లో పెళ్లి చేసుకొనే అవకాశం లేదు.
గతంలో ఓ సందర్భంలో నేను వివాహం చేసుకోకపోవచ్చని సాయి పల్లవి చెప్పడం కొసమెరుపు. కాగా ఇటీవల ఆమె బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో అనేక పుకార్లు తెరపైకి వచ్చాయి. సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుంది. డాక్టర్ వృత్తిలో కొనసాగాలి అనుకుంటుంది. అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చిందంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం తెలుగులో సాయి పల్లవి తండేల్ టైటిల్ తో ఒక మూవీ చేస్తుంది. నాగ చైతన్య హీరో కాగా చందూ మొండేటి దర్శకుడు.