spot_img
Homeఎంటర్టైన్మెంట్Tanuja And Kalyan: కళ్యాణ్ కి ఉంగరం తొడిగిన తనూజ..వీడియో వైరల్.. ఈ 'బిగ్ బాస్...

Tanuja And Kalyan: కళ్యాణ్ కి ఉంగరం తొడిగిన తనూజ..వీడియో వైరల్.. ఈ ‘బిగ్ బాస్ 9’ జోడి మధ్య మ్యాటర్ పరుగులు తీస్తోందే!

Tanuja And Kalyan: ‘బిగ్ బాస్ 9′(Bigg Boss 9 Telugu) పూర్తి అయ్యి దాదాపుగా 50 రోజులు కావొస్తుంది. కానీ కంటెస్టెంట్స్ గురించి చర్చలు మాత్రం సోషల్ మీడియా లో అసలు ఆగడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan), తనూజ(Tanuja), డిమోన్ పవన్(Demon Pavan), రీతూ చౌదరి(Ritu Chowdary)..వీళ్ళ పేర్లు సోషల్ మీడియా లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కళ్యాణ్, తనూజ జోడీని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ టైటిల్ విన్నర్ గా నిలబడగా, తనూజ రన్నర్ గా నిల్చింది. తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో క విన్నర్ , రన్నర్ ఒకరికోసం ఒకరు అడ్డంగా నిలబడడం అనేది ఎప్పుడూ జరగలేదు. వీళ్ళ మధ్య ఉన్నది స్నేహ బంధమో, లేదా ప్రేమ బంధమో తెలియదు కానీ, కచ్చితంగా స్నేహానికి మించిన బంధమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే వీళ్లిద్దరు బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ అభిమానుల మధ్య చాలా గొడవలే జరిగాయి.

తనూజ కి కళ్యాణ్ అంటే నిజమైన ఇష్టం లేదు, హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అతన్ని కలవకపోవడమే అందుకు కారణం, బిగ్ బాస్ హౌస్ లో కేవలం తన అవసరాలు కోసం మాత్రమే అతన్ని వాడుకుంది అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తనూజ పై అటాక్ చేయడం మొదలు పెట్టారు. మరోపక్క తనూజ ఫ్యాన్స్ కూడా ఇదే తరహా వాదనలు చేసేవారు. అసలు కళ్యాణ్ తనూజ వల్లనే టైటిల్ విన్నర్ అయ్యాడు, వీళ్ళ కంటెంట్ జనాల్లో పాజిటివ్ గా వెళ్తుందని, అది తనకే బాగా కలిసొచ్చింది అనే విషయాన్ని గ్రహించిన కళ్యాణ్ తన గేమ్ కోసమే తనూజ ని వాడుకున్నాడు అని ఆయన పైన కూడా ట్రోల్స్ వేశారు. ఇలా ఇద్దరు అభిమానులు పరస్పరం కొట్టుకోవడం, తనూజ, కళ్యాణ్ లు ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు వివరణ ఇవ్వడం వరకు వచ్చింది.

అయితే వీళ్లిద్దరు కలవలేదు అనే రూమర్స్ కి ఇక చెక్ పడినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే త్వరలోనే స్టార్ మా ఛానల్ లో ‘BB ఉత్సవం’ అనే ప్రోగ్రాం ప్రసారం కానుంది. ఈ ప్రోగ్రాం లో తనూజ, కళ్యాణ్ లతో పాటు సీజన్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ అందరూ పాల్గొన్నారు. మొన్ననే షూటింగ్ కూడా పూర్తి అయ్యింది. ఈ షూటింగ్ కి సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి. ఒక వీడియో లో తనూజ కళ్యాణ్ కి ఉంగరం తొడగడం హాట్ టాపిక్ గా మారింది. వామ్మో వీళ్ళ మధ్య మ్యాటర్ నడవడం లేదు, ఏకంగా పరుగులు తీస్తోంది అంటూ సోషల్ మీడియా లో ఈ వీడియో ని చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాదు, ఈ ఈవెంట్ లో వీళ్లిద్దరు కలిసి ‘చుట్టమల్లే చుట్టేశావే’ పాటకు చిందులేసారట, అది కూడా చాలా బాగా వచ్చినట్టు తెలుస్తోంది.

 

Thanuja and Kalyan in bb utsavam shoot #thanujaputtaswamy #kalyanpadala #bbutsavam #bb9telugu
Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper
Exit mobile version