Nethran Passed Away: తమిళ బుల్లితెర పరిశ్రమలో యువరాజ్ నేతురన్ పాప్యులర్ నటుడు. ఆయనను అందరూ నేత్రన్ అని సంబోధిస్తారు. ఆయన అకాల మరణం పొందారు. కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న నేత్రన్ తుది శ్వాస విడిచారు. నేత్రన్ మరణం నేపథ్యంలో సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయ్యింది. ఆయన అభిమానులు, సన్నిహితులు సంతాపం ప్రకటిస్తున్నారు. నేత్రన్ కి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య పేరు దీప మురుగన్, పెద్దమ్మాయి పేరు అంచన. చిన్నాయి అభినేయ.
నేత్రన్ కెరీర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైంది. దాదాపు 25 ఏళ్లుగా ఆయన పరిశ్రమలో ఉన్నారు. అనేక సూపర్ హిట్ సీరియల్స్ లో ఆయన నటించారు. నేత్రన్ నటించిన సింగప్పెన్నే, రంజితమే సీరియల్స్ ప్రస్తుతం ప్రసారం అవుతున్నాయి. ఆయన పలు రియాలిటీ షోలలో పాల్గొని గెలిచారు. మస్తానా మస్తానా, బాయ్స్ వర్సెస్ గర్ల్స్, సూపర్ కుటుంబం, జోడి నెంబర్ వన్ వంటి రియాలిటీ షోలలో నేత్రన్ పాల్గొన్నారు.
నేత్రన్ కి క్యాన్సర్ సోకిందన్న వార్తను ఆయన చిన్న కూతురు అభినయ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. నాన్నకు క్యాన్సర్ పాజిటివ్. సర్జరీ జరిగింది. లివర్ డామేజ్ కావడంతో ఐసీయూ లో చేర్చాము. నాన్న త్వరలోనే కోలుకుంటారు. మీ ఆశీర్వాదం ఆయనకు కావాలి. ప్రార్థనలు చేయండి.. అని అభినయ సోషల్ మీడియాలలో రాసుకొచ్చింది. ఇటీవల అభినయ స్వయంగా తయారు చేసిన కుకీస్ ఫోటోను నేత్రన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక నేత్రన్ మరణ వార్తను ఆయన మిత్రుడు డింగు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. నా మిత్రుడి మరణం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. రెస్ట్ ఇన్ పీస్ ఫ్రెండ్… అని ఆయన రాసుకొచ్చారు. నేత్రన్ భార్య, పిల్లలు కూడా తమిళ బుల్లితెర పరిశ్రమలో రాణిస్తున్నారు.