Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ‘పుష్ప 2’ ఒకటి. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో మేకర్స్ అయితే ఉన్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇదిలా ఉంటే ‘పుష్ప’ మొదటి పార్ట్ తో ‘నేషనల్ అవార్డు’ ని అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మంచి నటుడిగా మరోసారి ప్రశంసలను అందుకోవాలని చూస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను మొదట ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇక అనుకున్న సమయానికి షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో సినిమాని ఆగస్టు నుంచి డిసెంబర్ 6 వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.
అయినప్పటికీ ఇంకా షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నా నేపధ్యం లో సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి చేసుకుంటుంది. పోస్టు ప్రొడక్షన్ పనులు ఎప్పుడు జరుగుతాయనే విషయం మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ఇక వీళ్ళ వాలకం చూస్తుంటే మరోసారి సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే పుష్ప 2 సినిమా మీద భారీగా ఉన్న అంచనాలు కొద్ది కొద్దిగా తగ్గిపోతున్నాయి.
కారణం ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే సినిమా లేట్ అవ్వడం వల్ల సినిమా మీద ఉన్న అంచనాలు మరింత తగ్గిపోయే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ విషయం లో చేసిన కొన్ని ఆక్టివిటీస్ వల్ల ఈ సినిమా మీద కొంతవరకు వ్యతిరేకత అయితే ఏర్పడింది. కానీ ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ మరోసారి మారుతుండడం వల్ల ఈ సినిమా మీద మరింత వ్యతిరేకత ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుడికి అంచనాలు లేకుండా పోయే అవకాశాలైతే ఉన్నాయి. మరి మేకర్స్ ఎందుకిలా సినిమా రిలీజ్ విషయంలో లేట్ చేస్తున్నారు. అనుకున్న డేట్ కి సినిమాను ఎందుకు తీసుకురాలేకపోతున్నారనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరి ఈ విషయం మీద సుకుమార్ గాని, అల్లు అర్జున్ గాని ఎలా స్పందిస్తారు అనే విషయాలు కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…