https://oktelugu.com/

Balakrishna: బాలయ్య డేట్స్ కోసం ఎదురుచూస్తున్న ఇద్దరు తమిళ మాస్ డైరెక్టర్లు…

ప్పుడు చాలా రోజుల నుంచి హరి బాలయ్య తో ఒక సినిమా చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నిజానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. హరి మాస్ సినిమాలని చాలా దీటు గా తెరకెక్కిస్తాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 2, 2024 / 03:13 PM IST
    Follow us on

    Balakrishna: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు హరి. ఈయన ప్రస్తుతం ప్లాప్ ల్లో ఉన్నప్పటికీ, ఒక మాస్ సినిమాని ప్రేక్షకుడి కి నచ్చేలా తీయడంలో ఆయన ఎక్స్ పర్ట్ అనే చెప్పాలి.ఆయన చేసిన స్వామి, యముడు, సింగం లాంటి సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ముఖ్యంగా విక్రమ్ హీరోగా వచ్చిన స్వామి సినిమా తమిళం లో సూపర్ హిట్ అయింది. అయితే ఇదే సినిమాని తెలుగులో బాలకృష్ణ లక్ష్మీనరసింహ సినిమాగా రీమేక్ చేసి సక్సెస్ ని అందుకున్నాడు.

    ఇక ఇప్పుడు చాలా రోజుల నుంచి హరి బాలయ్య తో ఒక సినిమా చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నిజానికి వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. హరి మాస్ సినిమాలని చాలా దీటు గా తెరకెక్కిస్తాడు. బాలయ్య కూడా మాస్ సినిమాలు చేయడంలో తోపు, కాబట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

    మరి ఇలాంటి క్రమంలో బాలయ్య ఎందుకు హరీని దూరం పెడుతున్నాడు అంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి. ఇక బాలయ్య కోసం హరితో పాటు మరో తమిళ్ దర్శకుడు అయిన లింగు స్వామి కూడా ఎదురు చూస్తున్నాడు. ఈయన చేసిన ఆవారా సినిమా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఇక స్ట్రెయిట్ గా తెలుగులో రామ్ తో చేసిన ‘వారియర్ ‘ సినిమా ప్లాప్ అయ్యింది. దాంతో అంతకుముందే లింగు స్వామి బాలయ్య తో ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ వారియర్ ఫ్లాప్ అవడంతో బాలయ్య లింగు స్వామికి అవకాశం ఇవ్వట్లేదు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

    మరి హరి, లింగస్వామి లాంటి తమిళ డైరెక్టర్లు బాలయ్య వెంట పడుతుండటం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అనే చెప్పాలి. ఇద్దరు కూడా మాస్ డైరెక్టర్లు కావడం అది బాలయ్య కి చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో బాలయ్య తెలుగు డైరెక్టర్ల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు కానీ ఈ ఇద్దరు తమిళ్ డైరెక్టర్లను మాత్రం పట్టించుకోవడం లేదు…