https://oktelugu.com/

Budget 2024 : ‘మూడోసారి మోడీ’ అనే ఆత్మ విశ్వాసమే ఈ బడ్జెటు ప్రతి బింబం

'మూడోసారి మోడీ' అనే ఆత్మ విశ్వాసమే ఈ బడ్జెటు ప్రతి బింబం

Written By:
  • NARESH
  • , Updated On : February 2, 2024 / 03:20 PM IST
    Follow us on

    Budget 2024 : నిన్నటి నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఎన్నికలు మేలో జరుగుతుండడంతో ఈ మూడు నాలుగు నెలల వ్యయం అందులో ఖర్చు కోసం ప్రవేశపెడుతారు. ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించకుండా ప్రవేశపెట్టడం చాలా కష్టం. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు వరాలు కురిపిస్తుంది. 2013-14, 2019-20 బడ్జెట్లు చూస్తే మనకు అర్థమవుతుంది. 2013-14 కాంగ్రెస్ బడ్జెట్ ను చీటింగ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ప్లాన్ ఎక్స్ పండేచర్ పెట్టకుండా వదిలేయడంతో అభివృద్ధి ఆగిపోయింది. ఎన్నికల ముందు గెలుస్తామో లేదోనని ఇలా వచ్చే ప్రభుత్వంపై భారం మోపారు.

    కానీ 2019లో బీజేపీలో అలా చేయలేదు. నిజాయితీగా అన్ని కేటాయింపులు చేసి ఎక్కడా ఏమీ ఆగకుండా చూసుకున్నాడు. 2024-25 బడ్జెట్ అయితే అద్భుతమని చెప్పొచ్చు. చీటింగ్ అనేది లేదు. ఈ బడ్జెట్ లో తాయిలాలు ప్రకటించాలన్న భావన కూడా తీసుకురాలేదు. ఒక ఎకానమిస్ట్ ఇచ్చిన బడ్జెట్ లా ఉంది. సింగిల్ టేక్ అవే ఈ బడ్జెట్ లో తీసుకునేది ఏంటంటే.. ‘లక్ష కోట్లతో కార్పస్ ఫండ్’ను ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ కోసం కేటాయించారు. భవిష్యత్ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి ఈ ఫండ్ సమకూర్చారు.

    ‘మూడోసారి మోడీ’ అనే ఆత్మ విశ్వాసమే ఈ బడ్జెటు ప్రతి బింబం.. మోడీ సర్కార్ బడ్జెట్ పై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు