Yashasvi Jaiswal: సెంచరీ కొట్టిన యశస్వీ.. 2వ టెస్టులో పట్టుదలగా భారత్…

సీనియర్ ప్లేయర్లు ఔట్ అయినప్పటికీ తను మాత్రం ఎక్కడా భయపడకుండా తన వంతు పాత్రనైతే పోషిస్తూ వస్తున్నాడు. ఇక 117 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ నాటౌట్ గా నిలిచాడు.

Written By: Gopi, Updated On : February 2, 2024 3:06 pm
Follow us on

Yashasvi Jaiswal: ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగుతుంది. మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇండియన్ టీం తనదైన రీతిలో బ్యాటింగ్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఓపెనర్ ప్లేయర్ అయిన యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ ప్లేయర్లకు చుక్కలు చూపిస్తూ ఇండియన్ టీమ్ కి భారీ స్కోర్ ను అందించే విధంగా టీమ్ ను ముందు ఉండి నడిపిస్తున్నాడు.

ఇక సీనియర్ ప్లేయర్లు ఔట్ అయినప్పటికీ తను మాత్రం ఎక్కడా భయపడకుండా తన వంతు పాత్రనైతే పోషిస్తూ వస్తున్నాడు. ఇక 117 పరుగులు చేసిన యశస్వి జైశ్వాల్ నాటౌట్ గా నిలిచాడు. ఇక మూడు వికెట్లను కోల్పోయి 201 పరుగులు చేసిన ఇండియన్ టీమ్ మొదటిరోజు ఆటను సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తుంది. ఇక రోహిత్ శర్మ 14 పరుగులు చేసే అవటవగా, శుభ్ మన్ గిల్ 34, శ్రేయాస్ అయ్యర్ 27 పరుగులు చేశారు. ఇక మొదటి నుంచి ఇంగ్లాండ్ ప్లేయర్లను ఉతికి ఆరేస్తున్న యశస్వి జైస్వాల్ ఒక అజేయ సెంచరీ చేసి ఇండియన్ టీమ్ ను ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయమనే చెప్పాలి.

ఇక ఈ ప్లేయర్ దూకుడుని ఆపడం ఇంగ్లాండ్ బౌలర్ల వాళ్ళ కావడం లేదు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొదటి టెస్ట్ మ్యాచ్ లోనే జైశ్వాల్ తనదైన రీతిలో చెలరేగి ఆడుతూ గ్రౌండ్ నలుమూలలా పరుగులు రాబట్టాడు. ఇక అదే సీన్ ను ఈ రోజు కూడా రిపీట్ చేస్తూ ఈ మ్యాచ్ లో కూడా అద్భుతమైన సెంచరీ చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…

ఇక మ్యాచ్ లో ఇండియన్ టీమ్ విజయతీరాలకు చేరాలి అంటే అది యశస్వి జైశ్వాల్ వల్లే అవుతుందంటూ ఇప్పటికే పలువురు క్రికెట్ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 170 బంతుల్లో 3 సిక్స్ లు 13 ఫోర్ల తో జైశ్వాల్ 118 పరుగులు చేసి ముందుకు కదులుతున్నాడు. ఈరోజు మొత్తం జైస్వాల్ కనుక తన దూకుడు ను కొనసాగిస్తే ఇండియన్ టీమ్ భారీ పరుగులు చేస్తుంది. అలాగే ఇంగ్లాండ్ టీమ్ కి ఒక భారీ లక్ష్యాన్ని కూడా నిర్దేశించి పెట్టవచ్చు…ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో అండర్సన్, హార్ట్ లీ, బషీర్ లు తలో వికెట్ తీశారు. ఇక ప్రస్తుతం జైశ్వాల్, పాటిదర్ ఇద్దరు క్రేజ్ లో ఉన్నారు…