Kollywood: తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు రోడ్డు పక్కన అనాథ శవంలా ఉండటం అందరికీ కంటనీరు పెట్టిస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బ్లాక్‌బస్టర్ సినిమాలకు పని చేసిన దర్శకుడు త్యాగరాజన్ మృతి చెందారు. రోడ్డు పక్కన విగతజీవిలా పది ఉండడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. 1991లో విజయ్‌కాంత్ నటించిన మానగర కావల్ సినిమాకు ఈయన దర్శకుడు గా చేశారు. ఈ చిత్రం సంచలన విజయం సాధించగా… ఈ చిత్రాన్ని ఏవీఎమ్ సంస్థ నిర్మించింది. ఇది వాళ్లకు 150వ సినిమా కావడం విశేషం. ఆ సంస్థలో పని చేసిన త్యాగరాజన్… అదే ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కన అనాథగా చనిపోయిన ఘటన కోలీవుడ్‌లో కలకలం రేపుతుంది.
Also Read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ మీద సినీ ప్రముఖుల స్పందన.. రాజమౌళికి ‘టేక్ ఏ బౌ’..
‘వెట్రిమేల్ వెట్రి’ సినిమాతో దర్శకుడిగా మారాడు. అలా ఆయన తెరకెక్కించిన ‘మానగర కావల్’ అద్భుతమైన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అతనికి సినిమా ఆఫర్లు రాలేదని.. అది ఆయనను నిరాశకు గురి చేసిందని కోలీవుడ్ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. త్యాగరాజన్ తన భార్య పిల్లలతో మనస్పర్థలు కలిగి గత 15 ఏళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. అతడి భార్య 10 ఏళ్ళ కిందే చనిపోయారు. పిల్లలు బెంగళూరులో ఉన్నారు. ఆయన మాత్రం రోజూ అమ్మ క్యాంటీన్‌లో ఒక్క పూట మాత్రమే తింటూ జీవిస్తున్నాడని… ఓ టెంట్ వేసుకుని ఉంటున్నాడని పోలీసులు తెలిపారు. త్యాగరాజన్ మృతదేహాన్ని పోస్టుమార్టం పూర్తి చేసారు పోలీసులు. ఈయన మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఆర్మీ సోల్జర్‌గా రానా.. ఈ ఏడాది చివరి సినిమాగా విడుదల కానున్న ‘1945’