Site icon OkTelugu

F-35 fighter jet performance: అమెరికా ఎఫ్‌–35లదీ ఉత్తముచ్చటే.. ఇరాన్ వార్ లో ఢమాల్.. ఇండియా కొనంది అందుకే

F-35 fighter jet performance

F-35 fighter jet performance

F-35 fighter jet performance: ఇరాన్‌పై యుద్ధం ప్రకటించిన అమెరికాకు వరుసగా షాక్‌లు తగుతులున్నాయి. మొదటి రోజు ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీని చంపేశారు. దీంతో మూడు నాలుగు రోజుల్లో యుద్ధం ముగుస్తుందని భావించారు. కానీ నాలుగు రోజులకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు సినిమా కనిపించింది. నాలుగు వారాలు యుద్ధం కొనసాగుతుందని ప్రకటించారు. ఇక ఈ యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోతోంది. ఆర్థికంగా ఖర్చు పెరుగుతోంది. మరోవైపు పదికిపైగా యుద్ధ విమానాలు కూలిపోయాయి. తాజాగా అమెరికా తమ బలం అని చెప్పుకునే రెండు ఎఫ్‌–35 యుద్ధ విమానాలను కూడా కూల్చి షాక్‌ ఇచ్చింది.

స్టెల్త్‌ యుద్ధ విమానాల సాంకేతిక శక్తి
ఎఫ్‌–16, ఎఫ్‌–35 లాంటి అమెరికన్‌ ఫైటర్‌ జెట్లు రాడార్‌కు అందకుండా రూపొందించారు. ఈ విమానాలు మాక్‌ 1.6–2 వేగంతో ప్రయాణిస్తూ, అధునాతన సెన్సార్లు, ఆయుధాలతో ప్రపంచ సైన్యాల్లో ప్రధాన ఆయుధం. అణు ఆయుధాల లాంటి భారీ కార్గోలను మోసుకెళ్లగలవు అని అమెరికా చెబుతుంది.

మన మిగ్‌తో కూల్చివేత..
బాలకోట్‌ దాడి సమయంలో భారత మిగ్‌–21 పైగా ఎఫ్‌–16ను కూల్చినట్టు వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్తమాన్‌ నిరూపించారు. పాకిస్తాన్‌పై ఆపరేషన్‌ సిందూర్‌ షమయలోనూ ఎఫ్‌–16ను మన మిగ్‌ విమానం కూల్చింది. ఎఫ్‌–35 కొద్దిలో దాడి నుంచి తప్పించుకుంది. అంటే అమెరికా చెబుతున్నంత బలమైనవి ఏమీ కాదని తెలుస్తోంది.

తాజాగా ఇరాన్‌ కూల్చివేత..
తాజాగా ఇరాన్‌ అధికారులు రెండు అమెరికన్‌ ఎఫ్‌–35లను భుజం మీది ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థతో కూల్చామని ప్రకటించారు. ఈమేరకు వీడియో విడుదల చేశారు. స్థానిక రక్షణ వ్యవస్థలు వాటిని గుర్తించి ప్రతిఘటించాయని ఇరాన్‌ డైమ్‌. అమెరికా దీన్ని తిరస్కరించి, తమ విమానాలు సురక్షితంగా తిరిగాయని చెప్పింది.

ఎఫ్‌–35 సెన్సార్‌ సమ్మేళనం, దీర్ఘ దూర ఆయుధాలతో ఆధునిక యుద్ధాల్లో ఆధిపత్యం చెలాయిస్తుంది. కానీ దగ్‌ఫైట్‌లో ఎఫ్‌–16 విఫలమయ్యాయి. భారత్, ఇరాన్‌ లాంటి దేశాలు స్వదేశీ రాకెట్లు, రాడార్‌లతో వాటి బలహీనతలను బయటపెట్టాయి.

Exit mobile version