https://oktelugu.com/

1945 Movie: ఆర్మీ సోల్జర్​గా రానా.. ఈ ఏడాది చివరి సినిమాగా విడుదల కానున్న ‘1945’

1945 Movie: దగ్గుబాటి కుటుంబంలో నుంచి వచ్చి ఇప్పుడు స్టార్​ హీరోగా గుర్తింపు పొందారు రానా దగ్గుబాటి. బాహుబలితో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ హీరో.. వరుసగా విభిన్న చిత్రాలతో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. అందరూ బాహుబలి తర్వాత విలన్ పాత్రల్లోనే రానా ఇకపై కనిపిస్తాడని అనుకున్నారు. కానీ అరణ్య సినిమాతో అందరి అంచనాలు తలకిందులు చేసి చూపించారు. ఇప్పుడు పవన్​ కళ్యాణ్ హీరోగా వస్తున్న భీమ్లనాయక్​లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పోటాపోటీగా ఉండనుందని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 9, 2021 / 02:53 PM IST
    Follow us on

    1945 Movie: దగ్గుబాటి కుటుంబంలో నుంచి వచ్చి ఇప్పుడు స్టార్​ హీరోగా గుర్తింపు పొందారు రానా దగ్గుబాటి. బాహుబలితో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ హీరో.. వరుసగా విభిన్న చిత్రాలతో ముందుకు దూసుకెళ్లిపోతున్నారు. అందరూ బాహుబలి తర్వాత విలన్ పాత్రల్లోనే రానా ఇకపై కనిపిస్తాడని అనుకున్నారు. కానీ అరణ్య సినిమాతో అందరి అంచనాలు తలకిందులు చేసి చూపించారు. ఇప్పుడు పవన్​ కళ్యాణ్ హీరోగా వస్తున్న భీమ్లనాయక్​లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పోటాపోటీగా ఉండనుందని విడుదలైన టీజర్​, పాటలు చూస్తుంటేనే తెలుస్తోంది.

    1945 Movie

    కాగా, తాజాగా రానా నటించన సినిమాల్లో 1945 ఒకటి. పేట్రియాటిక్ నేపథ్యంలో రానున్న ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి. కళ్యాణ్ తెలిపారు. నిజానికి ఈ సినిమా 2016లోనే పూర్తి కాగా..తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీని సత్యశివ తెరకెక్కించారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

    Also Read: తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం… రోడ్డు పక్కన అనాథ శవంలా ప్రముఖ దర్శకుడు

    ప్రాణాలను పణంగా పెట్టి బ్రిటిష్​ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఎన్.ఐ.ఎ. (నేషనల్ ఇండియన్ ఆర్మీ) సోల్జర్ గా, సుభాష్‌ చంద్రబోస్ అనుయాయిగా రానా ఇందులో నటించారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి అనంత శ్రీరామ్ పాటలు రాయగా, ఆకుల శివ సంభాషణలు అందించాడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న పిరియాడిక్ మూవీ ‘1945’ ట్రైలర్ ను త్వరలో విడుదల చేయబోతున్నట్టు సి. కళ్యాణ్ తెలిపారు.

    ఈ సినిమాతో పాటు విరాట పర్వం కూడా సినిమా షూటింగ్​ పూర్తి చేసుకుని విడుదల సిద్ధంగా ఉంది. ఇందులో రానా, సాయిపల్లవి జంటగా నటించారు. వేణు ఉడుగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది.

    Also Read: భీమ్లానాయక్​ రన్​టైమ్ లాక్​.. ​ సుత్తె కొట్టకుండా ఉండేందుకే అలా చేశారంట?