ఎందుకు అన్నీ బూతులు ? ఫ్యామిలీ నెటిజన్ల కామెంట్లు !

Akhanda: బాలయ్య బాబు తన అఖండతో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర మొదలుపెట్టాడు. అటు యూఎస్ లో సైతం అఖండ భారీ వసూళ్లను సాధిస్తోంది. అఖండకు ఇప్పుడున్న ఊపు చూస్తుంటే.. చాలా ఈజీగా 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయం. ఇలా సినిమా గురించి ఎక్కడ చూసినా మంచి ఊపు కనిపిస్తోంది. కానీ, అఖండ సినిమా చూసి ఎందుకు అన్నీ బూతులు పెట్టారు అంటూ ఫ్యామిలీ నెటిజన్లు తెగ ఇదైపోతున్నారు. ఎంతో కష్టపడి గెలిచాక కళ్ళెంట నీటి […]

Written By: Shiva, Updated On : December 9, 2021 3:39 pm
Follow us on

Akhanda: బాలయ్య బాబు తన అఖండతో బాక్సాఫీస్ వద్ద దండయాత్ర మొదలుపెట్టాడు. అటు యూఎస్ లో సైతం అఖండ భారీ వసూళ్లను సాధిస్తోంది. అఖండకు ఇప్పుడున్న ఊపు చూస్తుంటే.. చాలా ఈజీగా 1 మిలియన్ మార్క్‌ను క్రాస్ చేయడం ఖాయం. ఇలా సినిమా గురించి ఎక్కడ చూసినా మంచి ఊపు కనిపిస్తోంది. కానీ, అఖండ సినిమా చూసి ఎందుకు అన్నీ బూతులు పెట్టారు అంటూ ఫ్యామిలీ నెటిజన్లు తెగ ఇదైపోతున్నారు.

Akhanda

ఎంతో కష్టపడి గెలిచాక కళ్ళెంట నీటి ప్రవాహం, నోరెంట విజయగర్జన రాకుండా ఎలా ఉంటుంది ?. ఆ వచ్చే క్రమంలో వచ్చే పదాలే బూతులు. అందుకే బూతులు మాట్లాడతారని, కాబట్టి బూతులను చూసి చూడనట్టు వదిలేయాలని చెబితే.. ఫ్యామిలీ ఆడియన్స్ అంగీకరించరు. అందుకే, ఎప్పటికీ బూతులు హర్చించతగ్గవి కాదు. నిజమే భావావేశాలు బయటపడే మార్గాలెన్నో కావొచ్చు.

ఆ మార్గాల్లో బూతులు మాట్లాట్టం కూడా ఒక మార్గం కావొచ్చు. కానీ, విజ్ఞత తెలిసిన వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు కాదు అని అర్ధం చేసుకోవాలి. కొందరికి బూతులు వ్యావహారిక భాషలో భాగం, పల్లెటూళ్లలో ఈ కల్చర్ ను మనం ఎక్కువుగా చూస్తూ ఉంటాం. అందుకే, బూతులు అనేవి ప్రభావవంతమైన వ్యక్తీకరణకు మార్గం అయింది.

ముఖ్యంగా ఏ యాసకు అయినా, భాషకు అయినా బూతులు అతికినట్టుంటాయి. బయటి వ్యక్తులు బాగా గమనిస్తే తప్ప, అందులో బూతులు పూర్తిగా అర్థమవ్వవు. ఉదాహరణకు అఖండ సినిమా డైలాగ్స్ నే తీసుకుందాం. ‘కాలుదువ్వే నంది ముందు..రంగు మార్చిన పంది కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది’ అంటాడు బాలయ్య.

Also Read: Kollywood: తమిళ ఇండస్ట్రీలో మరో విషాదం… రోడ్డు పక్కన అనాథ శవంలా ప్రముఖ దర్శకుడు

కొన్ని చోట్ల కారుకూతలు, పగిలిపోద్ది లాంటి పదాలు కూడా బూతులే. ఇక ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ ని తొక్కి పార దొబ్బుతా.!, కొడకా విధికి, విధాతకి, విశ్వానికి సవాళ్లు విసర కూడదు.!, ఇలా చాలా డైలాగ్ లు వాడుక భాష నుంచి వచ్చినీవే. కాబట్టి.. వీటిని బూతులు అని భావించలేం. అలా అని సరైన భాష అని కూడా అంగీకరించలేం. ఇదొక సినిమా భాష అంతే.

Also Read: Manchu Vishnu: మంచు విష్ణు కొత్త ఛాలెంజ్​.. నెట్టింట్లో పోస్ట్ వైరల్​

Tags