రివ్యూ : ‘నవంబర్ స్టోరీ’ – పేరులో ఉన్న స్టోరీ, సినిమాలో లేదు !

దర్శకుడు: ఇంద్ర సుబ్రమణియన్ నిర్మాణం : వికాటన్ టెలివిస్టాస్ సంగీతం : శరణ్ రాఘవన్ సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న ఎడిటింగ్ : శరణ్ గోవింద్ సామి నటీనటులు: తమన్నా, కులంధై యేసు, గణేశన్ తదితరులు. మిల్క్ బ్యూటీ తమన్నా వెబ్ సిరీస్ చేసింది అనగానే, ప్రేక్షకులలో కాస్త ఉత్సాహం కనిపించింది. పైగా ప్రస్తుతం కొనసాగుతున్న ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ ల క్రమంలో “నవంబర్ స్టోరీ” వచ్చింది కాబట్టి, నెటిజన్లు కూడా బాగానే ఆసక్తి చూపించారు. డిస్నీ […]

Written By: admin, Updated On : May 21, 2021 4:53 pm
Follow us on

దర్శకుడు: ఇంద్ర సుబ్రమణియన్
నిర్మాణం : వికాటన్ టెలివిస్టాస్
సంగీతం : శరణ్ రాఘవన్
సినిమాటోగ్రఫీ: విధు అయ్యన్న
ఎడిటింగ్ : శరణ్ గోవింద్ సామి
నటీనటులు: తమన్నా, కులంధై యేసు, గణేశన్ తదితరులు.

మిల్క్ బ్యూటీ తమన్నా వెబ్ సిరీస్ చేసింది అనగానే, ప్రేక్షకులలో కాస్త ఉత్సాహం కనిపించింది. పైగా ప్రస్తుతం కొనసాగుతున్న ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ ల క్రమంలో “నవంబర్ స్టోరీ” వచ్చింది కాబట్టి, నెటిజన్లు కూడా బాగానే ఆసక్తి చూపించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎలా ఉందో రివ్యూ చూద్దాం.

కథాకమామీషు :

కథ ఎలా మొదలు పెట్టాలో ఈ సిరీస్ తీసిన దర్శకుడికి కూడా అర్థం కాలేదు. ఇక మనకేం అర్థమవుతుంది.. ప్చ్ !. కానీ ఎక్కడో ఒక చోట ఈ బాగోతాన్ని మొదలుపెట్టాలి కాబట్టి, క్లుప్తంగా ముచ్చటించుకుంటే… అనురాధ(తమన్నా) ఓ ఎథికల్ హ్యాకర్, ఇక ఆవిడగారికి మతి స్థిమితం లేని ఓ తండ్రి ఉన్నాడు, పేరు గణేష్ (జిఎం కుమార్). ఇద్దరిది సాధారణ జీవనం, కాకపోతే ఇక్కడ ఇంకో దౌర్భాగ్యం ఉంది, మతి స్థిమితం లేని ఆ తండ్రిగారు ఇండియాలోనే ప్రముఖ క్రైమ్ బుక్ రైటర్ అట.

ఇక ఈ సిరీస్ టైటిల్ “నవంబర్ స్టోరీ” కదా, అందుకే నవంబర్ నెలలో ఓ రోజు ఊహించని విధంగా తమన్నా ఇంట్లో ఓ మర్డర్ జరుగుతుంది. ఇక ఆ శవం పక్కనే తమన్నా తండ్రి ఉంటాడు. అది చూసి తమన్నా షాక్ అవుతుంది. మనకు మాత్రం అప్పటికే నీరసం వచ్చేస్తోంది. ఇక ఎట్టిపరిస్థితుల్లో ఈ దిగువస్థాయి క్రైమ్ మిస్టరీని చూడలేం అని మనకు ఒక క్లారిటీ వస్తోంది.

ప్లస్ పాయింట్స్ :

తమన్నాకి ఉన్న గుర్తింపు,
నేపథ్య సంగీతం,
కొన్ని థ్రిలింగ్ ఎలిమెంట్స్.

మైనస్ పాయింట్స్ :

కథాకథనాలు,
నటీనటుల ఓవర్ యాక్టింగ్,
ఇంట్రెస్ట్ గా సాగని సీన్స్,
లాజిక్ లేని సీక్వెన్సెస్,
డైరెక్షన్ చేసిన విధానం,
స్లో సాగే సన్నివేశాలు.
రొటీన్ డ్రామా

సినిమా చూడాలా వద్దా ?

క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ అంటూ తమన్నా పోస్టర్స్ ను ప్రమోషన్స్ కి వాడుకుని, వ్యూస్ కోసం లేనిపోని బిల్డప్ లు ఇస్తున్నారు గానీ, ఈ సిరీస్ లో మ్యాటర్ లేదు. కొన్ని సీన్స్ లో పర్వాలేదు అనే ఫీలింగ్ వచ్చినా, వాటి కోసం గంటలు వృధా చేసుకోవడం వృధా. కాబట్టి, ప్రేక్షక మహాశయులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తోంది ఏమనగా.. దయచేసి ఈ దిక్కుమాలిన రొటీన్ వ్యవహారాల తతంగాన్ని చూసి విసిగి పోవద్దు అని మనవి చేసుకుంటున్నాము.