ఏపీ పోలీసులకు సుప్రీం షాక్.. రఘురామకు బెయిల్

తీవ్ర తర్జనభర్జనల నడుమ నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కావని.. పిటీషనర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే కేసు దర్యాప్తునకు ఎంపీ రఘురామకృష్ణంరాజు సహకరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటీషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని తెలిపింది. కేసు విచారణకు అవసరమైతే కనీసం […]

Written By: NARESH, Updated On : May 21, 2021 6:35 pm
Follow us on

తీవ్ర తర్జనభర్జనల నడుమ నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. రఘురామపై మోపిన అభియోగాలు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించేటంత తీవ్రమైనవి కావని.. పిటీషనర్ ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేస్తున్నట్టు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే కేసు దర్యాప్తునకు ఎంపీ రఘురామకృష్ణంరాజు సహకరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పిటీషనర్ మీడియా, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని తెలిపింది. కేసు విచారణకు అవసరమైతే కనీసం ఒకరోజు ముందు పిటీషనర్ కు నోటీసులు ఇవ్వాలని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావచ్చని తెలిపింది. ఇద్దరి వ్యక్తులు రూ.లక్ష పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.

రఘురామ బెయిల్ పిటీషన్ పై ఇరువైపులా పోటా పోటీగా వాదనలు సాగాయి. పిటీషనర్ తరుఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ప్రభుత్వం తరుఫున దవే వాదనలు వినిపించారు.

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదని ఏపీ ప్రభుత్వం తరుఫున దవే వాదనలు వినిపించారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికతో గాయాలకు గల కారణాలులేవు అంది.. గుజరాత్ సొసైటీ కేసు ఆధారంగా బెయిల్ పిటీషన్ కొట్టివేయాలని వాదించారు. హైకోర్టులో ఇంకా మెరిట్ ఆధారంగా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. అలాంటప్పుడు దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎలా పిటీషన్ దాఖలు చేస్తారు? అంటూ ఏపీ సర్కార్ తరుఫున వాదించారు. రఘురామ మీడియా, సోషల్ మీడియాలో కరోనా సంక్షోభ సమయంలో రెచ్చగొట్టేలా చేసిన 45 వీడియోలు సేకరించి విచారణ జరుపుతున్నామన్నారు. వాదనలు అన్నీ విన్న సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ మంజూరు చేస్తూ విచారణకు సహకరించాలని.. మీడియాకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది.