దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ గరిష్టాల దిశగా పరుగులు తీశాయి. చివరకు సెన్సెక్స్ 972 పాయింట్లు లాభపడి 50,540 వద్ద ముగియగా నిఫ్టి 269 పాయింట్లు ఎగబాకి 15,175 వద్ద స్థిరపడింది. ఓ దశలో 1000 పాయింట్లకు పైగా లాభపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.84 వద్ద నిలిచింది. దాదాపు కీలక రంగాల షేర్లన్నీ లాభాల్లో దూసుకెళ్లాయి.