Tamannaah , Vijay Varma
Tamannaah and Vijay Varma : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు తమకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. హీరోలు భారీ విజయాలను అందుకుంటూ తమ క్రేజ్ ని అంతకంతకు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. హీరోయిన్లు కూడా వాళ్ళు చేసిన సినిమాలతో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఎక్కువ కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు…
సినిమా ఇండస్ట్రీలో దాదాపు 20 సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న నటి తమన్న…తెలుగులో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని అందుకున్న ఈమె ప్రస్తుతం ఇండియా వైడ్ గా సినిమాలను చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. ఇక బాలీవుడ్ నటుడు ఆయిన విజయ్ వర్మ తో తను గత కొంత కాలం నుంచి డేటింగ్ చేస్తుందనే విషయం మనందరికి తెలిసిందే. ఇక ఈ మధ్యకాలంలో వీళ్లిద్దరి మధ్య కొన్ని విభేదాలు రావడంతో ఎవరికి వారు విడిపోయారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరలయ్యాయి. ప్రస్తుతం తమన్నా విజయ్ వర్మ ఒక పాప కి పేరెంట్స్ అయ్యారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వార్త వెనక ఉన్న సారాంశం ఏంటి అంటే ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన రవీనా టండానా కూతురు అయిన రాషా తడానా ‘ఆజాద్’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అజయ్ దేవగన్ మేనల్లుడు అయిన ఆమన్ దేవగన్ నటించిన ఈ సినిమాతో తను హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Also Read : పెళ్లి కాకుండానే తమన్నా కి ఇంత పెద్ద కూతురు ఉందా?
అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికి ఇప్పుడు తను మరొక సినిమా చేయడానికి సిద్ధమైంది. అయితే రీసెంట్ గా ఒక పార్టీలో తమన్నా తనకు పరిచయమైందని తను చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు తమన్న తనకు ధైర్యం చెప్పిందంటూ రాషా తడానా కొన్ని కామెంట్లు అయితే చేసింది. ఇక దాంతోపాటుగా తమన్నా ను విజయ్ వర్మను తన పేరెంట్స్ గా భావిస్తున్నాను అంటూ ఆమె మాట్లాడిన మాటలు బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాయి.
ఇక ఆ విధంగా తమన్నా విజయ్ వర్మ లు ఇద్దరూ పెళ్లి కాకుండానే రాషా తడానా కి పేరెంట్స్ గా మారిపోయారు అంటూ కొన్ని వార్తలైతే వినబడుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం అనేది గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే వీళ్ళు ఇప్పుడు విడిపోయారనే విషయం స్పష్టంగా తెలియడంతో అది కూడా హాట్ టాపిక్ గా మారుతుంది.
ప్రస్తుతం తమన్న తన సినిమాలను చేసుకుంటూ బిజీగా ఉంది. తెలుగులో ‘ఓదెల రైల్వే స్టేషన్ 2’ సినిమాలో నాగ సాధువుగా కనిపించబోతున్న తమన్న ఈ సినిమాతో మరోసారి తెలుగులో తన హవాని కొనసాగిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది…
Also Read : మాజీ ప్రియుడి కోటు ధరించిన తమన్నా..మళ్ళీ కలిసిపోయారా?