Pawan Kalyan , Mahesh Babu
Pawan Kalyan and Mahesh Babu : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి నటులు సైతం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయడానికి కొన్ని సినిమాలను చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలు వాళ్ళ స్టార్ డమ్ ని అంతకంతకు పెంచుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే ప్రయత్నమైతే చేస్తున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pavan Kalyan) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఆయన ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటివరకు ఏ హీరోకి లేనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరో కూడా తనే కావడం విశేషం… తన ఎంటైర్ కెరియర్ లో చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి భారీ సక్సెస్ లను సాధిస్తూ ప్రేక్షకులందరికి దగ్గరయ్యాడు. ఇక సినిమాల్లో నటన పరంగానే కాకుండా తన వ్యక్తిత్వం పరంగా కూడా తనకు అభిమానులుగా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న యంగ్ హీరోలు సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును కూడా వాడుకుంటూ వాళ్ళ క్రేజ్ ను పెంచుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నారు.
సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు (Mahesh Babu) లాంటి హీరో సైతం చాలా తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ గా ఎదిగి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు.
మరి ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ప్రస్తుతం ఆయన రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు…అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఇద్దరు కూడా చాలా మంచి స్టార్ డమ్ ను సంపాదించుకున్న హీరోలు కావడం విశేషం…
అప్పట్లో ఈ ఇద్దరు హీరోలను పెట్టి ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ ఆసక్తి చూపించాడు. కానీ అప్పుడున్న పరిస్థితులను బట్టి ఇద్దరు హీరోలకు న్యాయం చేయాలేమనే ఉద్దేశ్యంతో ఆ స్టోరీని పక్కన పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్..
ఈ ఇద్దరు హీరోలకి బాగా క్లోజ్ అయిన త్రివిక్రమ్(Trivikram) ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకున్నాడు. దానికి ఇద్దరూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి అది కార్యరూపం అయితే దాల్చలేదు. ఒకవేళ ఆ సినిమా కనుక వచ్చి ఉంటే ఇండస్ట్రీలో ఉన్న ఏ రికార్డు కూడా మిగిలి ఉండేది కాదు. ఈ మూవీ అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ భారీ విజయాన్ని సాధించేవాడు…
Also Read : మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో సినిమాలు మిస్ చేసుకున్న ఆ స్టార్ డైరక్టర్లు వీళ్లేనా..?