కరోనా భాదితులు అధికంగా ఉన్న ముంబై నగరం ఇపుడు దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది .బడా వ్యాపారస్తులు , సినీ స్టార్లు తమకు తోచిన రీతిలో ముంబై వాసులను ఆదుకొంటున్నారు. సినీ తారల్లో అక్షయ్ కుమార్ , సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్ , అమితాబ్ బచ్చన్ వంటి టాప్ స్టార్స్ తాము చేయగలిగినంత సాయం చేస్తున్నారు. వీరితో పాటు సోనూ సూద్ వంటి తారలు ముంబై వాసులకు మేమున్నామంటూ సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. అలాంటి వారి లిస్ట్ లోకి ఇపుడు తమన్నా చేరింది. మరో మారు తన పెద్ద మనసు చాటుకుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం చిరంజీవి ఏర్పాటు చేసిన `కరోనా క్రైసిస్ ఛారిటీ `(సిసిసి) నిధికి 3 లక్షల రూపాయల విరాళంగా ఇచ్చి తన మంచి మనసు చాటుకొంది. ఇపుడు ఇంకో అడుగు ముందుకు వేసి, ముంబైకి చెందిన `లెట్స్ ఆల్ హెల్ప్` అనే ఎన్జీఓతో చేతులు కలిపి ముంబైలోని దాదాపు 10,000 మంది వలస కార్మికులు మరియు మురికివాడలకు చెందిన ప్రజలకు సాయం చేయడానికి ముందు కొచ్చింది . ఆ క్రమం లో తన వంతు సాయంగా 50,000 కిలోల ఆహార పదార్దాలు, మందులు మరియు రోజువారీ నిత్యావసరాలను అందించ డానికి రెడీ అయ్యింది. అలా మరో మారు తన పెద్ద మనసు చాటుకుంది. అంతేకాదు ఇలాంటి కష్ట సమయాల్లో నిరాశ్రయులకు మనం అండగా నిలవాలని పిలుపు నిచ్చింది .
ప్రస్తుతం తమన్నా తెలుగులో గోపించంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీటీమార్ అనే చిత్రంలో నటిస్తుంది.ఇంకా కొన్ని తమిళ మరియు హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.