లాక్‌డౌన్ ఎత్తివేత దిశలో రాష్ట్రాలు… స్వరం పెంచిన మమతా

కేంద్రం విధించిన లాక్‌డౌన్ గడువు పూర్తి కాగానే దశల వారీగా దానిని ఎత్తివేసే దిశగా దేశం వెళ్లాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడే స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహింపనున్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ జరపబోవడానికి ముందే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలు సన్నాహాలు ప్రారంభించాయి. దేశంలో ఇంకా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైక పోయినా, కొన్ని రాష్ట్రాలలో పరిస్థితులు తీవ్రతరమవుతున్నా ఆర్ధిక కార్యక్రమాలు పునరుద్ధరించనిదే ముందుకు సాగడం […]

Written By: Neelambaram, Updated On : April 24, 2020 11:15 am
Follow us on


కేంద్రం విధించిన లాక్‌డౌన్ గడువు పూర్తి కాగానే దశల వారీగా దానిని ఎత్తివేసే దిశగా దేశం వెళ్లాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడే స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహింపనున్న ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ జరపబోవడానికి ముందే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశలు సన్నాహాలు ప్రారంభించాయి.

దేశంలో ఇంకా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం ప్రారంభమైక పోయినా, కొన్ని రాష్ట్రాలలో పరిస్థితులు తీవ్రతరమవుతున్నా ఆర్ధిక కార్యక్రమాలు పునరుద్ధరించనిదే ముందుకు సాగడం కష్టం అనే పరిస్థితులు నెలకొన్నాయి. లాక్‌డౌన్ సడలించడానికి అవసరమైన భూమిక తయారు చేసుకోవడం కోసం పేరు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాలను తగ్గించి చూపే ప్రయత్నాలు చేస్తున్నాయి.

కరోనా అనుమానంతో మృతి చెందిన వారిని కరోనా మృతుల జాబితాలో చేర్చవద్దని, వారు కుటుంభం సభ్యులు, సన్నిహితులకు సహితం కరోనా పాజిటివ్ వస్తేనే వారి మరణాలను ఆ జాబితాలో చేర్చాలని అంటూ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాయి.

లాక్‌డౌన్ ఎత్తివేత దశల వారీగా జరగాలని సూచించడం ద్వారా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బనెర్జీ ఒక ప్రణాలికను సూచించడం ద్వారా, దేశంలో మొదటగా ఈ విషయమై స్వరం విప్పినవారయ్యారు.

అయితే తెలంగాణ సీఎం చంద్రశేఖరరావు మాత్రం దీనిని మే 7 వరకు పొడిగించడమే కాకుండా, పరిస్థితుల సమీక్షకు మే 5న మంత్రివర్గం సమావేశమై తదుపరి చర్యల గురించి చర్చిస్తుందని ప్రకటించారు. అంటే కరోనా కట్టడి కానీ పక్షంలో మరింతగా పొడిగించే అవకాశం ఉన్నదన్న సంకేతం ఇచ్చారు.

ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే హాట్ స్పాట్ లు కాకుండా మిగిలిన ప్రాంతాలలో లాక్‌డౌన్ సడలింపుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. కర్ణాటకలో ఇప్పటికే కొంత సడలింపు ఇచ్చారు. ఒడిస్సా కూడా ఇచ్చింది. మమతా అయితే మే 4 తో మొదలయ్యే వారంలో 25 శాతం, రెండోవారంలో 50 శాతం.. మొత్తం మీద మే 4 తర్వాత రెండువారాలకు లాక్‌డౌన్ పూర్తిగా తొలగించాలని సూచించారు.

అయితే ఇది ఒక పౌరురాలిగా, తృణమూల్ కాంగ్రె స్అధినేత్రిగా తన అభిప్రాయమని చెప్పడం ద్వారా తుది నిర్ణయం ప్రధానిదే అన్న సంకేతం ఇచ్చారు. అయితే ఆమె కొన్ని పరిమితులు కూడా పెట్టారు. విమానాలు, రైళ్లు నడపరాదు. ముఖ్యంగా దూరప్రాంతపు రైళ్లను అనుమతించరాదు. కరోనా ఉధృతంగా ఉన్న ప్రాంతాల్లో నివారణ చర్యలు కొనసాగించాలని ఆమె వివరించారు.

ఏది ఏమైనా మే 3 తర్వాత పూర్తిగా లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశాలు లేవని స్పష్టం అవుతున్నది. ముఖ్యంగా విమానాలు, రైళ్లను కనీసం మరో నెలరోజుల పాటు పూర్తిగా నడపడం సాధ్యం కాదని భావిస్తున్నారు.