క్వారంటైన్ ఉల్లంఘనలు షూరు!

కరోనా వైరస్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవగాహనతో ఉంటుంటే దేశవిదేశాలు తిరుగుతున్న విద్యావంతులు మాత్రం విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉండకుండా విచ్చల విడిగా తిరుగుతున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉండేవారిపై నిఘా కోసం ఏపీ పోలీసులు ప్రవేశపెట్టిన జియో ఫెన్సింగ్ టెక్నాలజీ అప్లికేషన్ ను ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఈ అప్లికేషన్ లో హోమ్ క్వారంటైన్ మొత్తం 22,478 మందిని పోలీసులు నమోదు చేసుకున్నారు. ఇరవై ఎనిమిది రోజులపాటు […]

Written By: Neelambaram, Updated On : April 24, 2020 11:35 am
Follow us on


కరోనా వైరస్ గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల అవగాహనతో ఉంటుంటే దేశవిదేశాలు తిరుగుతున్న విద్యావంతులు మాత్రం విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉండకుండా విచ్చల విడిగా తిరుగుతున్నారు. హోమ్ క్వారంటైన్ లో ఉండేవారిపై నిఘా కోసం ఏపీ పోలీసులు ప్రవేశపెట్టిన జియో ఫెన్సింగ్ టెక్నాలజీ అప్లికేషన్ ను ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఈ అప్లికేషన్ లో హోమ్ క్వారంటైన్ మొత్తం 22,478 మందిని పోలీసులు నమోదు చేసుకున్నారు. ఇరవై ఎనిమిది రోజులపాటు ఈ అప్లికేషన్ ద్వారా వారిపైన నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాప్ లో నమోదు చేసుకున్న వారిలో 3,043 మంది జియో ఫెన్సింగ్ టెక్నాలజీ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. క్వారంటైన్ కేంద్రం నుంచి 50 మీటర్ల దూరం మించి బయటకు వెళ్లితే కంట్రోల్ రూమ్ లో అలెర్ట్ మోగి ఎవరు నిబంధనలు ఉల్లంఘించింది తెలియజేస్తుంది. ఇలా చేసిన వీరిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం, అధికారులు ఎంత మొత్తుకున్నా హోమ్ క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించి ప్రవర్తించడం విమర్శలకు తావిస్తోంది.

పోలీసు శాఖ తీసుకువచ్చిన కొత్త యాప్ కారణంగా హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారిపై నిఘా పటిష్ఠంగా కొనసాగుతుంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిని వెంటనే గురించి, తగు చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేయడంతో కట్టడి చేయడంతో చాలా వరకు సఫలమవుతుంది. రెడ్ జోన్ లో ప్రజల రాకపోకల నియంత్రణ పైన పోలీసు శాఖ ప్రయత్నం చేస్తోంది.